ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి మొదలైంది. ఈ వేడుకల్లో ఎంతో విశిష్టత కలిగిన క్రిస్మస్ చెట్టును విభిన్న రీతుల్లో ఏర్పాటు చేస్తున్నారు ప్రజలు.
స్పెయిన్ దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ‘ద కెంపిన్‌స్కి హోటల్ బాహియా’ క్రిస్మస్ చెట్టును వినూత్నంగా ఏర్పాటు చేసింది. సుమారు రూ.107.6 కోట్ల (15 మిలియన్ డాలర్ల) విలువైన వ్రజాలతో దీన్ని అలంకరించింది. దీని పొడవు 16 అడుగులు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత ఖరీదైన క్రిస్మస్ చెట్టని అంచనా. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి : మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం దక్కించుకోండిలా...