కరోనావైరస్ పుట్టుకను తెలుసుకునేందుకు అవసరమైన డేటాను పంచుకోవడంలో చైనా సహకరించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పరిశోధకులు తెలిపారు. కరోనా జన్మస్థానం గురించే తెలుసుకునేందుకు ఇటీవల చైనాలో పర్యటించిన ఈ బృందం సభ్యులు.. అక్కడ తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.
'అడ్డుపడ్డారు'
చైనా వుహాన్‌లో తొలుత వైరస్ బారినపడిన రోగుల వివరాలను అక్కడి అధికారులు అందించలేదని తెలిపారు. కరోనా సమాచారం తెలుసుకోకుండా చైనా అధికారులు అడ్డుపడ్డారని వివరించారు. భవిష్యత్తులో ఈ మహమ్మారి విజృంభించకుండా ఉండేందుకు కావాల్సిన ముఖ్యమైన ఆధారాలు తెలుసుకోలేకపోయమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పిల్లలపై టీకాలను ప్రయోగించనున్న ఆక్స్ఫర్డ్