ETV Bharat / international

ఒలింపిక్స్​ వేళ చైనాలో కరోనా కలకలం.. బీజింగ్​లోని ఆ ప్రాంతం సీజ్​ - నేపాల్​లో కరోనా కేసులు

China Covid Restrictions: వింటర్​ ఒలింపిక్స్​ నేపథ్యంలో కొవిడ్​ కేసులను కట్టడి చేసేందుకు చైనా​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాజధాని బీజింగ్​లోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలు చేసింది. ప్రజలు బయటరావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు కొవిడ్​ వ్యాప్తి తీవ్రత కారణంగా ఐదు నుంచి పదకొండేళ్ల వయసు ఉన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు యూకే ప్రకటించింది.

UK Vaccine for Kids
ఆ దేశంలో 5-11 ఏళ్ల వారికి కొవిడ్​ టీకా!
author img

By

Published : Jan 30, 2022, 8:34 PM IST

China Covid Restrictions: చైనాలో మరికొద్ది రోజుల్లో వింటర్​ ఓలింపిక్స్​ జరగనున్న నేపథ్యంలో కరోనా కట్టడిపై తీవ్రంగా కృషి చేస్తున్నారు అక్కడి అధికారులు. ఒలింపిక్స్​ ప్రారంభమయ్యే నాటికి నగరంలో ఒక్క కరోనా కేసు కూడా లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వైరస్​ వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. బీజింగ్​లో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. దీంతో ఉత్తర బీజింగ్​లోని అనేక ఇళ్లను సీజ్​ చేశారు. చౌవోయాంగ్​ జిల్లాలోని అన్​జెన్​లీ ప్రాంతంలో కఠిన ఆంక్షలు విధించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

జీరో టోలరెన్స్​ పాలసీని కఠినంగా అమలు చేస్తున్న అధికారులు.. ఓలింపిక్స్​ ప్రారంభమయ్యేవరకు ఆ ప్రాంతంలోని ప్రజలకు తరచూ పరీక్షలు నిర్వహించేలా 19 టెస్టింగ్​ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.

ఆ వయసు పిల్లలకు కూడా..

UK Vaccine for Kids: ఒమిక్రాన్​ వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్​ను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించింది యూకే. ఇప్పటికే టీనేజర్లకు, పెద్దలకు విస్తతృంగా టీకాలను పంపిణీ చేస్తుండగా.. తాజాగా 5-11 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సిన్లు అందించాలని నిర్ణయించింది.

పిల్లలపైనే కొవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటోందని అందుకే వీరికి వీలైనంత వేగంగా వ్యాక్సిన్లు అందించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఇమ్యూనోసప్రషన్​, మానసిక సమస్యలు సహా తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా టీకాలు అందించనున్నట్లు తెలిపారు. ఇంగ్లాండ్​లో వ్యాక్సిన్​కు అర్హులైన పిల్లల సంఖ్య దాదాపు 5 లక్షలుగా ఉందని.. త్వరలోనే వీరికి తొలిడోసు అందిస్తామని చెప్పుకొచ్చారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా ఇప్పించేందుకు వెనుకాడకూడదని పిలుపునిచ్చారు అధికారులు.

నేపాల్​లో కొవిడ్​ కలకలం

కరోనా వ్యాప్తి నేపాల్​లో కూడా తీవ్రంగా ఉంది. కొత్తగా ఆ దేశంలో 3,540 కేసులు బయటపడ్డాయి. 6,359 మంది కోలుకోగా.. 32 మంది మృతి చెందారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 83,999గా ఉంది.

ప్రస్తుతం నేపాల్​లో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, జిమ్​లు​, లైబ్రరీ వంటి బహిరంగ ప్రదేశాలను మూసివేసింది అక్కడి ప్రభుత్వం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : ba2 omicron: బీఏ.2 వేరియంట్ కలకలం.. 54 దేశాల్లో కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.