ETV Bharat / international

'టీకా తీసుకుంటే వైరస్ ముప్పు 3 రెట్లు తక్కువ' - కరోనా టీకాతో లాభాలు

కరోనా టీకా తీసుకుంటే వైరస్‌ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. డెల్టా వేరియంట్‌ వంటి కొత్త రకాల నుంచి టీకా ద్వారా రక్షణ పొందవచ్చని బ్రిటన్‌ పరిశోధకులు తేల్చారు.

covid vaccine
కరోనా టీకా
author img

By

Published : Aug 4, 2021, 6:57 PM IST

కొవిడ్‌ టీకా తీసుకుంటే వైరస్‌ ముప్పు తగ్గుతుందని బ్రిటన్‌ పరిశోధకులు తేల్చారు. కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌కు చెందిన పరిశోధకులు జూన్‌ 24 నుంచి జులై 12 మధ్యకాలంలో ఓ అధ్యయనం చేపట్టారు. దాదాపు 98వేల మందిపై పరిశోధన చేయగా.. అందులో రెండు డోసులు తీసుకున్నవారిలో సగం మంది మాత్రమే వైరస్‌ బారినపడే ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు.

కొవిడ్‌ లక్షణాలు కనిపించిన వారిలోనూ వైరస్‌ను ఎదుర్కొనే సమర్థత 59 శాతం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. 254 పాజిటివ్‌ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేపట్టగా వాటిలో ఎక్కువగా డెల్టా వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు.

డెల్టాతో మరోసారి వైరస్!

వ్యాక్సిన్‌ తీసుకోని యువకుల్లో ఇన్‌ఫెక్షన్లు, ఆస్పత్రి చేరికలకూ ఉన్న సంబంధాన్ని తాజా అధ్యయనంలో నిపుణులు గుర్తించారు. గతంలో వైరస్‌ సోకినవారికి డెల్టా వేరియంట్‌ తోడై మరోసారి వ్యాధిగ్రస్తులయ్యే ప్రమాదం ఉందని కనుగొన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

పోల్చి చూస్తే...

వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి 120మందిలో ఒకరికి వైరస్‌ సోకగా, వ్యాక్సిన్‌ తీసుకోని ప్రతి 40మందిలో ఒకరికి వైరస్‌ సోకుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వైరస్‌ ప్రాబల్యం 0.40శాతం ఉంటే తీసుకోనివారిలో 1.21శాతం ఉందని లెక్కకట్టారు. అంతేకాకుండా టీకా పొందిన తర్వాత వైరస్‌ బారినపడిన బాధితుల్లో వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉన్నట్లు బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. టీకా తీసుకున్నవారికి వైరస్‌ సోకినా ప్రమాదం తీవ్రత తక్కువగా ఉంటుందని తేల్చారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​పై అనుమానాలా?.. ఇదిగో క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.