బ్రిటన్ రాజకుమారుడు ఫిలిప్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం చేరి చికిత్స తీసుకుంటున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన వయస్సు 99 ఏళ్లు. క్వీన్ ఎలిజిబెత్ -II భర్త అయిన ఫిలిప్.. తన వైద్యుడి సలహా మేరకు ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే పరిశీలనలో ఉండి విశ్రాంతి తీసుకుంటారని ప్యాలెస్ వర్గాలు పేర్కొన్నాయి. కరోనా వైరస్‌తో బ్రిటన్‌లో విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో రాణితో కలిసి ఫిలిప్ వెస్ట్ లండన్‌లోని విండ్సోర్ రాజభవనంలోనే ఉంటున్నారు. జనవరి నెలలో క్వీన్ ఎలిజిబెత్, ఫిలిప్ తొలి డోసు కొవిడ్ టీకాను తీసుకున్నారు.
ఇదీ చూడండి: జూన్ వరకు ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులోనే పాకిస్థాన్!