ప్రాణాంతక కరోనా వైరస్‌ను జయించిన బ్రిటన్ ప్రధాని... తిరిగి విధులకు హాజరుకానున్నారు. ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయిన 2 వారాల అనంతరం.. లండన్ డౌనింగ్ స్ట్రీట్‌లోని తన కార్యాలయానికి ఇవాళ చేరుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.
బోరిస్‌ను తీసుకొచ్చినదిగా భావిస్తున్న ఓ వ్యాన్.. లండన్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయం వద్ద ఆదివారం కనిపించింది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ప్రభుత్వ కార్యకలాపాలను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
2 వారాలు ఐసీయూలోనే...
బోరిస్ జాన్సన్‌కు మార్చి నెలాఖరులోనే కరోనా వైరస్ సోకింది. కానీ ఆయనకు లక్షణాలు తగ్గకపోవడం వల్ల లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రికి తరలించారు. సమస్య కాస్త తీవ్రం కావడం వల్ల ఐసీయూకు మార్చి చికిత్స అందించారు అధికారులు. చివరకు కరోనాపై విజయం సాధించిన బోరిస్ ఏప్రిల్ 12న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 2 వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు.