బ్రిటీష్ ప్రధాని కార్యాలయంలో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు బోరీస్ జాన్సన్, సైమండ్స్. ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారట. త్వరలో వివాహం కూడా చేసుకోబోతున్నారట.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఆయన నాయకత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఒకప్పుడు కమ్యూనికేషన్ చీఫ్‌గా వ్యవహరించిన సైమండ్స్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు.
ఇటీవల సైమండ్స్ తాను చాలా అదృష్టవంతురాలినని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. గతేడాది చివర్లో వారిద్దరికీ నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలో పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వేసవిలో వారు ఓ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిపారు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ఇప్పటికే జాన్సన్ తన రెండో భార్య మరీనా వీలర్‌కు నలుగురు పిల్లల సంతానం. 1993లో పెళ్లి చేసుకున్న వారిద్దరూ.. 2018లో విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఇప్పుడు సైమండ్స్ బిడ్డకు జన్మనిస్తే మరోసారి తండ్రి అవుతారు ఈ ప్రధాని.