ETV Bharat / international

గిన్నిస్​ రికార్డుల్లోకి ఆ జంట.. ఎలాగంటే? - guinness world record

బ్రిటన్​కు చెందిన ఓ జంట గిన్నిస్​ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇద్దరి మధ్య 1.7 అడుగులు ఎత్తు వ్యత్యాసమే అందుకు కారణం. ప్రపంచంలో అత్యంత ఎత్తు వ్యత్యాసం ఉన్న జంటగా గిన్నిస్​ బుక్​ ధ్రువీకరించింది.

britain couple guinness world record
అతడు.. ఆమె.. ఓ గిన్నిస్‌ రికార్డు!
author img

By

Published : Jun 25, 2021, 6:36 AM IST

ఎత్తు విషయంలో అత్యంత పొట్టి వ్యక్తులు.. అత్యంత పొడుగు వ్యక్తులు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకి ఎక్కడం చూశాం. కానీ ఓ జంట తమ మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం వల్ల గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించుకుంది. బ్రిటన్‌కు చెందిన జేమ్స్‌ ఎత్తు 3.7 అడుగులు(109.3 సెంటిమీటర్లు) కాగా.. అతడి భార్య క్లోవి ఎత్తు 5.4 అడుగులు(166.1 సెంటిమీటర్లు). వీరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం 1.7 అడుగులు. దీంతో ప్రపంచంలో అత్యంత ఎత్తు వ్యత్యాసం ఉన్న జంటగా గిన్నిస్‌ రికార్డు దక్కింది.

జేమ్స్‌కు డయోస్ట్రోఫిక్‌ డిస్‌ప్లాసియా అనే వ్యాధి ఉంది. అరుదైన ఈ వ్యాధి సోకిన వారికి ఎముకల్లో ఎదుగుదల సరిగా లేక ఎత్తు పెరగరు. దీంతో జేమ్స్‌ ఎదుగుదల 3.7 అడుగులకే నిలిచిపోయింది. కాగా క్లోవి అందరిలాగే సాధారణమైన యువతి. వీరిద్దరూ 2012లో తొలిసారి కలుసుకున్నారు. మనసులు కూడా కలవడం వల్ల 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అలా ప్రేమకు ఆస్తి.. అంతస్తు.. అందం.. ఎత్తుతో కూడా పనిలేదని ఈ జంట నిరూపించింది. తాను ఎప్పుడూ పొడుగ్గా ఉండే వ్యక్తులనే ఇష్టపడేదాన్నని, కానీ జేమ్స్‌ను కలిశాక తన అభిప్రాయం మారిపోయిందని క్లోవి చెప్పుకొచ్చారు. ప్రేమలో పడ్డ కొత్తలో తమను చూసినవాళ్లు ఏం అనుకుంటారోననే భయం ఉండేదని, ఆ తర్వాత ఆ భయాన్ని పక్కన పెట్టేసి వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంటకు రెండేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల వీరిద్దరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం గురించి గిన్నిస్‌ బుక్‌ సంస్థకు తెలిసింది. దీంతో జేమ్స్‌-క్లోవి జంటను పరిశీలించి రికార్డు సాధించినట్లు ప్రకటించింది.

ఇదీ చదవండి : ఈయన స్పీడ్​కు గిన్నిస్ రికార్డులు దాసోహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.