బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson) మూడో పెళ్లి చేసుకున్నారు. తన ప్రేయసి క్యారీ సైమండ్స్‌ను శనివారం వివాహమాడినట్లు బ్రిటన్ పత్రికలు వెల్లడించాయి. ఇరు కుటుంబాలు, స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో 56ఏళ్ల జాన్సన్(Boris Johnson) తన నెచ్చెలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలిపాయి.
![britan pm third wife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11950335_123_11950335_1622336574884.png)
![britan pm third wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11950335_johnson.jpg)
జాన్సన్‌కు ఇది మూడో వివాహం. 2020 ఫిబ్రవరిలో నిశ్చితార్ధం చేసుకున్నట్లు జాన్సన్, సైమండ్స్ ప్రకటించారు. వీరికి ఇప్పటికే ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. 1822లో లార్డ్ లివర్‌పూల్ తర్వాత బ్రిటన్ ప్రధాని పదవిలో ఉంటూ వివాహం చేసుకున్న తొలి వ్యక్తి బోరిస్ జాన్సన్(Boris Johnson).
![britan pm boris jhonson wedding](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11950182_111.png)
ఇదీ చూడండి: Viral: తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం!
ఇదీ చూడండి: మార్స్‌పై గింగిరాలు కొట్టిన నాసా హెలికాప్టర్