ETV Bharat / international

G7 Summit: అఫ్గాన్‌ పరిణామాలపై జీ-7 కూటమి సమావేశం - బైడెన్

అఫ్గాన్‌లో దిగజారుతున్న పరిస్థితులు(Afghanistan news), అక్కడి నుంచి స్థానికులతో పాటు అమెరికా తదితర దేశాల పౌరులను సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు జీ-7 కూటమి దేశాలు(G7 Summit) సమావేశం కానున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాని ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

boris, g-7
బోరిస్ జాన్సన్, జీ-7 కూటమి
author img

By

Published : Aug 23, 2021, 5:02 AM IST

Updated : Aug 23, 2021, 6:39 AM IST

అఫ్గానిస్థాన్​లో (Afghanistan news) పరిస్థితులపై చర్చించేందుకు జీ-7 కూటమి దేశాలు(G7 countries) ఈనెల 24న సమావేశం కానున్నట్లు బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. అఫ్గాన్​ నుంచి స్థానికులతో పాటు ఇతర దేశాల పౌరులను సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

  • I will convene G7 leaders on Tuesday for urgent talks on the situation in Afghanistan. It is vital that the international community works together to ensure safe evacuations, prevent a humanitarian crisis and support the Afghan people to secure the gains of the last 20 years.

    — Boris Johnson (@BorisJohnson) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై అత్యవసర చర్చల కోసం మంగళవారం జీ-7 నాయకుల సమావేశం జరగనుంది. కాబుల్‌ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ సురక్షితంగా సాగేలా, స్థానికంగా ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేలా, 20 ఏళ్లలో అఫ్గాన్‌ ప్రజలు సాధించిన ప్రగతిని కాపాడేలా.. అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం చాలా అవసరం" అని బోరిస్​ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

జీ-7 కూటమిలో(G7 Summit 2021) అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

వర్చువల్​గా హాజరుకానున్న బైడెన్..

జీ-7 కూటమి సమావేశానికి (G7 Summit) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) వర్చువల్​గా హాజరుకానున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు. అఫ్గాన్​లో దిగజారుతున్న పరిస్థితులు, 20 ఏళ్లుగా తమ సైన్యానికి సాయం చేసిన స్థానికులు, బలగాలను సురక్షితంగా వెనక్కి రప్పించే అంశాలపై బైడెన్ చర్చించనున్నట్లు పేర్కొన్నారు. శరణార్థులకు సాయం చేసే అంశంపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు సాకి.

అస్థిరంగానే పరిస్థితులు..

అఫ్గాన్​ను వీడేందుకు కట్టుబట్టలతో అనేక మంది స్థానికులు కాబుల్​ విమానాశ్రయం(Kabul airport) వద్ద గుమిగూడుతున్న నేపథ్యంలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల వల్ల చాలా మంది మరణిస్తున్నారని, ఇంకా అస్థిరంగానే పరిస్థితి ఉందని అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. విమానాశ్రయం(Kabul airport) గేట్ల వద్ద ప్రజలు గుమిగూడటాన్ని నిర్మూలించేందుకు మార్గాల్ని అన్వేశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచ దేశాల మద్దతు అవసరం..

అఫ్గానిస్థాన్​ను ప్రస్తుత పరిస్థితుల నుంచి బయట పడేసేందుకు ప్రపంచ దేశాలు సంయుక్తంగా పనిచేయాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు. ఐరోపా కమిషన్ ఉపాధ్యక్షుడు జోసెప్ బోరెల్​తో మాట్లాడిన ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు.

అఫ్గాన్​ ప్రజల హక్కులను రక్షించడమే లక్ష్యంగా పనిచేయాలని ఖురేషి కోరారు. ప్రపంచ దేశాలు అఫ్గాన్​ పరిస్థితులను(Afghanistan latest news) నిరంతరం గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

Afghan crisis: ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు

Afghan crisis: పంజ్​షీర్​పై తాలిబన్ల కన్ను- కోట కూలేనా?

Last Updated : Aug 23, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.