ETV Bharat / international

కరోనా టీకా​ 'హ్యూమన్ ఛాలెంజ్​'కు బ్రిటన్​ రెడీ - హ్యూమన్‌ ఛాలెంజ్‌ ప్రయోగాలకు బ్రిటన్​ సన్నాహాలు

వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేయనుంది. తాజాగా హ్యూమన్‌ ఛాలెంజ్‌ ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వీటిలో పాల్గొన్న వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత వారికి వైరస్‌ సోకేలా చేస్తారు. అనంతరం వైరస్‌ సమర్థతను పరీక్షిస్తారు. ఇప్పటికే తుదిదశకు చేరుకున్న వ్యాక్సిన్‌ ప్రయోగాలకు, తాజా విధానం మరో ముందడుగు కానుంది.

Human Challenge' trials
హ్యూమన్ ఛాలెంజ్​
author img

By

Published : Sep 24, 2020, 4:49 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ల క్లినికల్‌ ట్రయల్స్‌లో కేవలం ఆరోగ్యవంతులపైనే టీకా ప్రయోగిస్తున్నారు. తద్వారా శరీరంలో యాంటీబాడీల స్థాయిని అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్​ ప్రయోగాల్లో బ్రిటన్​ మరో ముందడుగు వేయనుంది. ఇకపై హ్యూమన్​ ఛాలెంజ్‌ ట్రయల్స్‌ను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

వీటిలో పాల్గొన్న వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత వారికి వైరస్‌ సోకేలా చేస్తారు. అనంతరం వైరస్‌ సమర్థతను పరీక్షిస్తారు. దీంతో వ్యాక్సిన్‌ పనితీరు కచ్చితంగా తెలిసే ఆస్కారం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా బయో కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఫ్లూ, మలేరియా, కలరా వంటి వ్యాధుల చికిత్స, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఇటువంటి ప్రయోగాలను చేపట్టారు. తాజాగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, చికిత్స పరిశోధనల్లో ఈ తరహా ప్రయోగాలు ఎంతవరకు సత్ఫలితాలిస్తాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేయనున్నారు.

జనవరి నెలలో ఛాలెంజ్‌ ట్రయల్స్‌ చేపట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ప్రయోగాల్లో ఏ కంపెని తయారు చేసిన వ్యాక్సిన్‌ను పరీక్షిస్తున్నారనే విషయం తెలియరాలేదు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫికి చెందిన వ్యాక్సిన్‌లు మాత్రం ఈ ప్రయోగాల్లో వాడడం లేదని సమాచారం.

నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు..

హ్యూమన్‌ ఛాలెంజ్ ప్రయోగాలపై అంతర్జాతీయంగా నిపుణుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. అమెరికాలో ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ కూడా ఈ ప్రయోగాలను గతంలోనే వ్యతిరేకించారు. అయితే, వ్యాక్సిన్‌ సమర్థతను పరీక్షించేందుకు మాత్రం ఇటువంటి ప్రయోగాలు దోహదపడతాయని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

2వేల మందిపై..

లండన్‌లో జరిపే హ్యూమన్‌ ఛాలెంజ్‌ ప్రయోగాల్లో దాదాపు 2వేల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు అమెరికాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ ఆర్థిక సాయంతో చేపట్టనున్న ఈ ప్రయోగాల్లో, దాదాపు 100 నుంచి 200 మంది వలంటీర్లకు కావాల్సిన బయో క్వారంటైన్‌ సౌకర్యాలను ఈ సంస్థ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

బ్రిటన్‌లో జరిగే ఈ హ్యూమన్‌ ఛాలెంజ్‌ ప్రయోగాలను ఇంపీరియల్‌ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రయోగాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రయోగాల్లో భాగస్వామిగా ఉండనున్న స్వచ్ఛంద సంస్థ 1డే సూనర్‌ మాత్రం హ్యూమన్‌ ఛాలెంజ్‌ కోసం ప్రయోగాల ఏర్పాట్లను ధ్రువీకరించింది.

ఇదీ చూడండి: 'ఫిట్​నెస్​ ప్రోటోకాల్స్​'ను ప్రారంభించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.