బ్రిటన్‌లో కరోనా నియంత్రణలోకి వస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను సడలించే అవకాశం కనిపిస్తోంది. లాక్డౌన్ కఠిన నిబంధనలను 'కొవిడ్ పాస్పోర్ట్స్' పేరుతో దశలవారిగా ఎత్తివేస్తూ.. క్రీడలు, నైట్‌క్లబ్‌లు వంటి సామూహిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం.. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
రానున్న నెలల్లో జరగనున్న ట్రయల్ ఈవెంట్స్ వివరాలను జాన్సన్ వెల్లడించనున్నారు. ఈ ట్రయల్ ఈవెంట్స్ ద్వారా వినోద ప్రదేశాలు, క్రీడా ప్రాంగణాలు, ఆడిటోరియాల్లోకి ప్రేక్షకులు రావడానికి ఎలా సహాయపడతాయో పరీక్షించనున్నారు. మహమ్మారి నియంత్రణలోకి వస్తున్న వేళ ఏడాది తర్వాత నిబంధనలు సడలించేందుకు యూకే ప్రభుత్వం యోచిస్తుంది.
ఈ ట్రయల్ ఈవింట్ సడలింపులు మే నెల మధ్య వరకు ఉంటాయని.. జూన్ 21న పూర్తిగా సడలించే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు జాన్సన్.. ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: చైనాలో బోటు ప్రమాదం - 12 మంది దుర్మరణం