బ్రిటన్లో డిసెంబర్ 12న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కన్సర్వేటివ్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్. వ్యాట్, ఆదాయ పన్ను, జాతీయ బీమా.. ఈ మూడింటింకి సంబంధించిన రేట్లను పెంచబోమని స్పష్టం చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందలేకపోయిన బ్రెగ్జిట్ బిల్లును ఈసారి ఎలాగైనా పూర్తి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేశారు బోరిస్.
బ్రెగ్జిట్ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్నికల్లో జట్టుకట్టిన ప్రతిపక్ష కూటమిపై ధ్వజమెత్తారు బోరిస్. వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2050వరకు వాళ్లకు రాజకీయ మనుగడ లేకుండా చేయాలన్నారు.
-
NEW: Today we’re announcing that we will deliver 50,000 more nurses, and provide nursing students with an annual grant of £5,000-£8,000.#ConservativeManifesto pic.twitter.com/54314UXC47
— Conservatives (@Conservatives) November 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">NEW: Today we’re announcing that we will deliver 50,000 more nurses, and provide nursing students with an annual grant of £5,000-£8,000.#ConservativeManifesto pic.twitter.com/54314UXC47
— Conservatives (@Conservatives) November 24, 2019NEW: Today we’re announcing that we will deliver 50,000 more nurses, and provide nursing students with an annual grant of £5,000-£8,000.#ConservativeManifesto pic.twitter.com/54314UXC47
— Conservatives (@Conservatives) November 24, 2019
మొత్తం 59 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు బోరిస్. దేశ వ్యాప్తంగా ఉన్న 50 వేల మంది నర్సులకు నూతనంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ఏడాదికి 750 మిలియన్ పౌండ్లను కేటాయించనున్నట్లు తెలిపారు.
వలసల నియంత్రణకు ఆస్ట్రేలియా స్టైల్ పాయింట్స్ తరహా వ్యవస్థను తీసుకురానున్నుట్లు మేనిఫెస్టోలో పొందుపరిచారు బోరిస్.
ఇదీ చూడండి:పవార్ల మధ్య 'ట్వీట్ల వార్'- ఉత్కంఠగా 'మహా' రాజకీయం