బెల్జియంలోని పిపా అనే సంస్థ ఇటీవల రేసింగ్‌లో పాల్గొన్న పావురాలను వేలంపాట వేసింది. ఈ కార్యక్రమంలో 'న్యూ కిమ్' అనే రెండేళ్ల వయసున్న ఆడ కపోతాన్ని ఏకంగా రూ. 14కోట్లు (1.6 మిలియన్ యూరోలు) వెచ్చించి ఓ చైనా వ్యాపారవేత్త కొనుగోలు చేశారు.
రెండు వారాల పాటు సాగే ఈ వేలంపాట కార్యక్రమం సోమవారం ముగియనుంది. చైనాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సూపర్ డూపర్, హిట్‌మ్యాన్ అనే మారు పేర్లతో నిర్వహిస్తున్నారు. ఈ వేలంలో మొత్తం 445 పక్షులను అమ్మారు.