ETV Bharat / international

వీరికి 'గొడ్డళ్లు' అంటే ఎంత ప్రేమో! - గొడ్డళ్ల డిజైన్లు

సాధారణంగా మనం గొడ్డలిని కట్టెలు కొట్టడానికి, చెట్లు నరకడానికి, జంతువుల నుంచి రక్షణ కోసం వాడుతుంటాం. కానీ ఉక్రెయిన్‌లోని ఓ ప్రాంతంలో గొడ్డలిని ఆయుధంగా కంటే అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తున్నారు. విభిన్నఆకృతుల్లో వైవిధ్యంగా రూపొందించిన గొడ్డళ్లను పలు రకాల వేడుకల్లో ధరిస్తూ.. పురాతన సంప్రదాయాన్ని భావి తరాలకు అందిస్తున్నారు.

beautiful axes
అలంకరణ వస్తువుగా గొడ్డలి
author img

By

Published : Aug 7, 2021, 8:28 PM IST

ఉక్రెయిన్‌.. అరుదైన పురాతన సంప్రదాయాలకు చిరునామాగా నిలుస్తున్న దేశం. ఇక్కడి కార్పాతియన్ పర్వతాలలో నివసించే తెగవారు.. అనాదిగా వస్తున్న తమ సంప్రదాయాల్ని పాటించటంలో భాగంగా.. గొడ్డలిని అలంకరణ వస్తువుగా ఉపయోగిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. పండుగలు, పెళ్లి వేడుకల్లో సంప్రదాయ దుస్తులతో గొడ్డళ్లు పట్టుకుని పాటలు పాడుతుంటారు. వివాహ సమయంలో యువకుడు గొడ్డలిని ధరించడం అక్కడి సంప్రదాయం.

axe making proffession
ఇంట్లో అలంకరణ వస్తువుగా అమర్చిన గొడ్డళ్లు
axe tradition
అందమైన గొడ్డళ్లు
celebrations with axes
గొడ్డళ్లు పట్టుకుని వేడుకలు
beautiful axes
అందంగా అలంకరించిన గొడ్డళ్లు

జీవనోపాధిగా..

స్థానికుల్లో కొంతమందికి ఈ గొడ్డళ్ల తయారీనే జీవనోపాధి. ఆ కోవకు చెందిన హస్త కళాకారుడే నాజర్ హబోరాక్. హత్సుల్ అనే సంప్రదాయ గొడ్డలిని తయారు చేయటంలో మంచి నేర్పరి. తన కుటుంబం తరతరాలుగా కొనసాగిస్తున్న గొడ్డలి తయారీ వృత్తిలో తన తాత దగ్గర శిక్షణ తీసుకున్నాడు నాజర్. స్థానిక తెగల సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా విభిన్నమైన గొడ్డలను తయారు చేయటంలో తనదైన ముద్ర వేస్తున్నాడు.

ukarine axe making
గొడ్డలి తయారీలో నిమగ్నమైన నాజర్​

కుటుంబ సభ్యుల సహకారంతో..

సంప్రదాయ గొడ్డళ్ల రూపకల్పనలో కాంస్యం, ఇత్తడి, అల్యూమినియం, జింక్, రాగి వంటి లోహాలు ఉపయోగిస్తున్నాడు నాజర్​. ఈ ఆయుధాల రూపకల్పనలో నాజర్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటున్నారు.

axe making in ukraine
గొడ్డళ్ల రూపకల్పనలో నాజర్​ కుటుంబం

"నా కుమారుడు విటాలీ గొడ్డలిని డ్రిల్లింగ్ చేస్తే..నా భార్య మరియా గొడ్డలిని అలంకరించే పనిలో నిమగ్నమవుతుంది. నెలకు 30 నుంచి 40 గొడ్డళ్లను తయారు చేస్తాము. వాటిని 10 అమెరికన్ డాలర్లకు విక్రయిస్తున్నాం."

-నాజర్​ హబోరాక్, హస్త కళాకారుడు

ఈ వృత్తితో కుటుంబాన్ని పోషించటమే కాకుండా.. చరిత్రను కూడా కాపాడుతున్నానని గర్వంగా చెబుతున్నాడు నాజర్​.

ఇదీ చూడండి: ఆ దేశంలో విడాకులు తీసుకోలేరు!

ఇదీ చూడండి: ఆ ఎయిర్​ బ్యాగ్​ ఖరీదు రూ. 5 లక్షలా- ఎందుకంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.