అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన ఇంటిని ఆధునికీకరించి.. పోలీసు స్టేషన్‌గా మార్చడానికి ఆస్ట్రియాలోని ప్రభుత్వాధికారులు ప్రణాళికలు రూపొందించారు. నాజీ నియంత హిట్లార్ను కీర్తించే ప్రజల కోసం ఆకర్షణీయంగా మార్చడానికి ఆస్ట్రియన్ అధికారులు ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.
హిట్లర్ ఇంటిని పునర్నిర్మించడానికి 11మంది టెండర్లు వేయగా.. మార్టే మార్టే అనే వాస్తుశిల్పి టెండర్ దక్కించుకున్నట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి తెలిపారు. దీని పునర్నిర్మాణం 2022నాటికి పూర్తి అవుతుందని.. 5.6డాలర్ల వ్యయమవుతుందని అధికారులు వివరించారు.
జర్మనీ సరిహద్దుల్లో ఉన్న బ్రౌనౌ ఆమ్ ఇన్లోని ఈ ఇంటి యాజమాన్యం, భవిష్యత్ ఉపయోగాలపై కొన్ని సంవత్సరాల పాటు సందిగ్ధం కొనసాగింది. ఇంటి యజమాని అమ్మడానికి నిరాకరించగా.. ఆ ఇంటిని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉందని 2017లో ఆస్ట్రియా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: అమెరికాలో ఎటుచూసినా నిరసన జ్వాలలే..