ETV Bharat / international

Astrazeneca: టీకాతో అతికొద్దిమందిలో ఆ సమస్య!

author img

By

Published : Jun 11, 2021, 7:07 AM IST

ఆస్ట్రాజెనెకా టీకా వల్ల రక్తానికి సంబంధించిన ఓ సమస్య ఉత్పన్నం కావొచ్చని బ్రిటన్ శాస్త్త్రవేత్తల్లు ఓ అధ్యయనంలో తేల్చారు. అయితే.. ఈ సమస్య అతికొద్దిమందిలోనే వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు.

astrazeneca
ఆస్ట్రాజెనెకా, కరోనా టీకా

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం-ఆస్ట్రాజెనెకా టీకా(Astrazeneca vaccine) వల్ల అతికొద్ది మందిలో రక్తానికి సంబంధించిన ఒక సమస్య ఉత్పన్నం కావొచ్చని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనివల్ల వారిలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు.

రక్తనాళాలు దెబ్బతిన్న సమయంలో రక్తస్రావాన్ని ఆపడానికి ఈ ప్లేట్‌లెట్లు ఉపయోగడపతాయి. వీటి సంఖ్య తగ్గిపోవడం వల్ల రక్తస్రావం ముప్పు పెరగడం, కొన్ని కేసుల్లో గడ్డలు ఏర్పడటం జరుగుతుంది. ఇడియోపాథిక్‌ థ్రాంబోసైటోపెనిక్‌ పర్పురా (ఐటీపీ) అనే రుగ్మత వల్ల ఈ ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి. ఆస్ట్రాజెనెకా టీకా పొందినవారిలో అతికొద్దిమందిలో ఇది ఉత్పన్నం కావొచ్చని 54 లక్షల మందిపై ఈ అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

10 లక్షల డోసులు వ్యాక్సినేషన్‌కుగాను 11 మందిలో మాత్రమే ఇది తలెత్తుతుందని పేర్కొన్నారు. ఫ్లూ, తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా (ఎంఎంఆర్‌) టీకాల విషయంలోనూ ఇదే స్థాయిలో ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్లు చెప్పారు. సరాసరిన 69 ఏళ్ల వయసువారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు తేల్చారు.

ఇదీ చదవండి:'కరోనా మూలాలపై పారదర్శక దర్యాప్తు జరగాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.