ETV Bharat / international

యాంటీ వైరస్ సృష్టికర్త​ 'మేకఫీ' ఆత్మహత్య! - మెకాఫీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ సంస్థ అధినేత

తొలి యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త , 75 ఏళ్ల అమెరికా పౌరుడు జాన్‌ మేకఫీ స్పెయిన్‌లోని జైలులో అనుమానాస్పదంగా మృతిచెందారు. పన్ను ఎగవేత కేసులో మేకఫీని అమెరికాకు అప్పగించడానికి స్పెయిన్‌లోని ఓ కోర్టు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన మరణించారు. మేకఫీ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని... జైలు అధికారులు తెలిపారు.

McAfee
మెకాఫీ
author img

By

Published : Jun 24, 2021, 1:03 PM IST

Updated : Jun 24, 2021, 1:51 PM IST

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త జాన్ మేకఫీ స్పెయిన్‌లోని బార్సెలోనా జైలు గదిలో మృతి చెందారు. పన్ను ఎగవేత అభియోగాలు ఎదుర్కొంటున్న మేకఫీని అమెరికాకు అప్పగించడానికి స్పెయిన్‌లోని ఒక కోర్టు అంగీకరించిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు. ఆయన్ను బతికించేందుకు జైలు వైద్యులు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయిందని కేటలాన్ న్యాయ విభాగం తెలిపింది. మేకఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాల ద్వారా తెలుస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు

ప్రపంచానికి తొలి కమర్షియల్ యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అందించిన సంస్థ మేకఫీ. మేకఫీ తయారు చేసిన వైరస్‌స్కాన్ కంప్యూటర్ ప్రపంచంలో వేల కోట్ల డాలర్ల యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ వ్యాపారానికి నాంది పలికింది. తరువాత దాన్ని టెక్ దిగ్గజం ఇంటెల్ 760 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.

పన్ను ఎగవేత ఆరోపణలతో..

జాన్ మేకఫీ 2020 అక్టోబర్‌లో స్పెయిన్ నుంచి టర్కీకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కన్సల్టింగ్ వర్క్, ప్రసంగాలు, క్రిప్టోకరెన్సీ, తన జీవిత కథ హక్కుల అమ్మకం ద్వారా వందల కోట్లు సంపాదించినప్పటికీ నాలుగేళ్లుగా పన్నులు ఎగ్గొట్టారని ఆయనపై కేసు నమోదు చేశారు. మేకఫీ తన ఆదాయాన్ని నామినీల బ్యాంకు ఖాతాల్లోనూ, క్రిప్టోకరెన్సీ ఖాతాల్లోనూ జమ చేసి పన్ను ఎగవేశారని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆరోపించింది. ఈ కేసును విచారించే అధికారాన్ని స్పెయిన్ జాతీయ కోర్టు బుధవారం అమెరికాకు అప్పగించింది.

తనను వ్యూహాత్మకంగా కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని గత కొన్నేళ్లుగా మేకఫీ ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపినట్లు స్పానిష్ వార్తాపత్రిక ఈఎల్ పెయిస్ తెలిపింది. ఇంగ్లండ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్‌లో జన్మించిన ఈ పారిశ్రామికవేత్త 1980లలో తన సొంత సాంకేతిక సంస్థను స్థాపించి, మేకఫీ వైరస్‌స్కాన్‌ను కనిపెట్టనప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చారు.

ఇదీ చదవండి: Hawking: హాకింగ్‌ సిద్ధాంతం గెలిచింది

Last Updated : Jun 24, 2021, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.