ETV Bharat / international

'మాస్క్​పై యాంటీ వైరల్​ కోటింగ్​తో కరోనాకు చెక్' - యాంటీ వైరల్​ మాస్క్​ చేసిన బ్రిటన్

మాస్క్​పై యాంటీ వైరల్​ కోటింగ్​ సాంకేతికతతో కరోనా వైరస్​ అంతమవుతుందని కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికమైన విషయాలు వెల్లడించారు.

Anti-viral coating on face masks
'మాస్క్​పై యాంటీ వైరల్​ కోటింగ్​తో కరోనాకు చెక్'
author img

By

Published : Feb 15, 2021, 5:43 AM IST

Updated : Feb 15, 2021, 7:37 AM IST

యాంటీ వైరల్​ కోటింగ్ టెక్నాలజీతో మాస్క్​పై ఎలాంటి కరోనా వైరస్ మ్యుటెంట్లు​ అయినా హతమవుతాయని కేంబ్రిడ్జ్​ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ సాంకేతికతకు 'డియో ఎక్స్​' అని పేరు పెట్టారు. ఈ సాంకేతికతతో... బ్రిటన్​లో వ్యాపిస్తోన్న కెంట్ వేరియంట్​, దక్షిణాఫ్రికాలో వ్యాప్తిస్తోన్న మరో వైరస్​ వేరియంట్​లను సైతం అంతమొందించొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

"మాస్క్​పై యాంటీవైరల్​ పూత పూయడం ద్వారా అది వైరస్​ పైపొరను అంతం చేస్తుంది. ఎలాంటి మ్యుటెంట్ల​కైనా పైపొర ఒకే మాదిరిగా ఉంటుంది. ఈ తరుణంలో వివిధ వైరస్​ వేరియంట్లను అంతం చేయడం సులభమవుతుంది" అని కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గ్రహమ్ క్రిస్టీ పేర్కొన్నారు. దాదాపు అన్ని కరోనా వైరస్​ వేరియంట్లు ఒకే మాదిరిగా ఉన్నందున... ఇది అన్ని వేరియంట్లపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

వస్త్ర పరిశ్రమల్లో క్వాటర్నరీ అమ్మోనియమ్ లవణాల వినియోగం ఆధారంగా ఈ డియో ఎక్స్​ ప్రయోగం జరిపారు శాస్త్రవేత్తలు. లాబొరేటరీ పరీక్షల్లో... ఈ లవణాల పూత పూసిన మాస్క్​పై గంట సమయంలో 95 శాతం వైరస్​ హతమవుతున్నట్లు తేలిందని పేర్కొన్నారు. నాలుగు గంటల తర్వాత వైరస్​ ఆనవాళ్లు కనిపించడంలేదని వెల్లడించారు.

ఈ మాస్క్​ను పలుమార్లు వినియోగించొచ్చని 20 సార్లు ఉతకొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మాస్క్​ సామర్థ్యాన్ని పరీక్షించినప్పుడు 'ఎమ్​హెచ్​వీ-ఏ59' కరోనా వైరస్​ వేరియంట్​ ఉపయోగించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:డబ్ల్యూహెచ్​ఓకు చుక్కలు చూపించిన చైనా

Last Updated : Feb 15, 2021, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.