ఏదైనా గుహలోకి ప్రవేశిస్తే చిమ్మ చీకటితో కూడిన ప్రదేశం దర్శనమిస్తుంది. కానీ స్పెయిన్లోని అండాలూసియా సమీపంలోని ఓ గుహ ఇందుకు విరుద్ధంగా ఖనిజాలతో అబ్బురపరుస్తోంది. పెద్ద మొత్తంలో సహజసిద్ధ ఖనిజాలు కలిగిన ఈ జియోడ్ గుహను తొలిసారిగా ఈ ఏడాది అక్టోబర్లో వీక్షకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు అధికారులు.
స్పెయిన్లోని అండాలూసియా పట్టణానికి 50 మీటర్ల దూరంలో ఈ గుహ ఉంది. రాతితో కూడిన ఈ ఖనిజ గనులనే 'జియోడ్' అని పిలుస్తారు. ఇక్కడి సహజసిద్ధ ఖనిజ సంపదతో తమ పట్టణం పల్పి రూపురేఖలు మారతాయని స్థానికుల విశ్వాసం. సందర్శకులు గుహలోకి ప్రవేశించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
"ఐరోపా ఖండంలో ఇలాంటి జియోడ్ ఇదొక్కటే. మెక్సికోలోని నైకా గనిలో ఇలాంటి జియోడ్ ఒకటుంది. అది దీనికంటే చాలా పెద్దది. అయితే 200 మీటర్ల లోతు ఉన్నందున అందులోకి వీక్షకులు వెళ్లడం కష్టం. ప్రపంచంలో వీక్షకులు ప్రవేశించగల అతిపెద్ద జియోడ్ ఇదే."
- ఫెర్నాండెజ్ అమో, భూగోళ శాస్త్రజ్ఞులు