అఫ్గానిస్థాన్ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం తీక్షణంగా గమనించాలని, ఆ దేశం నుంచి ఎదురయ్యే సవాళ్లపై (Modi on Afghanistan) ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అఫ్గాన్ సమస్యకు మూలకారణమైన తీవ్రవాదం, ఉగ్రవాదం సహా.. వాటి పర్యవసనాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటలీ పర్యటనలో (Modi in Italy) ఉన్న ఆయన ఆ దేశ ప్రధానమంత్రి మారియో డ్రాగితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అఫ్గాన్ పరిస్థితిని ఒంటరిగా చూడలేమని ప్రధాని (Modi Italy Tour) నొక్కి చెప్పారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.
"సుపరిపాలన అందించడంలో పరిస్థితులను ఎదుర్కోవడంలో వైఫల్యం, అసమర్థతపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. అఫ్గాన్ నుంచి ఎదురయ్యే ప్రతి సమస్యను అంతర్జాతీయ సమాజం జాగ్రత్తగా గమనించాలి. అయితే ఈ సమస్యల వల్ల అఫ్గాన్ పౌరులు ఇబ్బందులు ఎదుర్కోకూడదు. అఫ్గాన్ పాలకులు, అఫ్గాన్ పౌరులను వేర్వేరుగా చూడాలి. అవసరమైనవారికి తప్పకుండా మానవతా సహాయం అందించాలి. అఫ్గాన్ పౌరులకు ప్రత్యక్షంగా, ఆటంకం లేకుండా సహాయం అందే చర్యలు తీసుకోవాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
మరోవైపు, భావసారూప్యత కలిగిన దేశాలు ఇండోపసిఫిక్ ప్రాంతంలో సహకారం అందించుకోవాల్సిన అభిప్రాయం క్రమంగా బలపడుతోందని శ్రింగ్లా పేర్కొన్నారు. ఐరోపా సమాఖ్య లీడర్లతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ (Modi Italy Tour) పాల్గొన్నట్లు తెలిపిన ఆయన.. ఈ మేరకు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇండో పసిఫిక్ అంశంపై ఇప్పటికే వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకున్నాయని శ్రింగ్లా గుర్తు చేశారు.
టార్గెట్ చైనా?
ఇండో పసిఫిక్ అంశంపై భారత్‌తో (PM Modi news) పని చేసేందుకు ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లెయెన్, ఐరోపా మండలి అధ్యక్షుడు ఛార్లెస్ మైఖెల్.. సంసిద్ధత వ్యక్తం చేశారని శ్రింగ్లా తెలిపారు. ఐరోపా సమాఖ్య ఇండో పసిఫిక్‌పై ఇప్పటికే 'స్ట్రాటజీ పేపర్'ను రూపొందించిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో ఐరోపా లీడర్లతో ప్రధాని సమావేశం కావడం గమనార్హం.
"ఈ అంశంపై ఐరోపా నేతలు సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఉన్నతస్థాయి బృందాన్ని పంపించాలని మోదీ సూచించారు. ఇండో పసిఫిక్ సహకారంపై అభిప్రాయాలు పంచుకోవడం సహా.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చని అన్నారు. ఇండోపసిఫిక్పై సారూప్య దేశాలు పరస్పరం సహకరించుకోవాలన్న భావన స్పష్టంగా పెరుగుతోంది."
-హర్షవర్ధన్ శ్రింగ్లా, విదేశాంగ కార్యదర్శి
మరోవైపు, ఇటలీలోని భారత సంతతి (Modi in Rome) ప్రజలను కలిశారు మోదీ. భారత సంతతి ప్రజలు ఏర్పాటు చేసుకున్న సంస్థల ప్రతినిధుతో రోమ్‌లో సమావేశమయ్యారు. ఇటాలియన్ హిందూ యూనియన్, ఇటాలియన్ కాగ్నెగేషన్ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ సంస్థలతో పాటు సిక్కు కమ్యూనిటీ ప్రతినిధులు, ప్రపంచ యుద్ధాల్లో భాగంగా ఇటలీలో పోరాడిన భారత సైనికుల గౌరవార్థం ఏర్పాటైన సంస్థలతో మోదీ సమావేశమైనట్లు శ్రింగ్లా తెలిపారు. సంస్కృత నిపుణులు, పరిశోధకులను సైతం కలిశారని చెప్పారు. సంస్కృతికి ప్రాచుర్యం కల్పిస్తూ భారత్-ఇటలీ మధ్య సంబంధాలు బలోపేతం చేస్తున్నందుకు వీరికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: