ETV Bharat / international

రూ. 2లక్షలకు అమ్ముడుపోయిన 90పైసల 'చెంచా'

ఓ పాత స్పూన్​.. ఓ వ్యక్తికి కాసుల వర్షం కురిపించింది. దానిని కొన్న ధరకు.. అమ్మిన రేటుకు 12వేల రెట్లు వ్యత్యాసం ఉండటం విశేషం. 90 పైసలకు కొంటే.. రూ. 2లక్షలకు వేలంలో అమ్ముడుపోవడం అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ ఆ చెంచాలో అంత ప్రత్యేకత ఏముంది?

A 90 Paisa Spoon Sold For 2 Lakhs in an Online Auction
స్పూన్​
author img

By

Published : Aug 1, 2021, 12:52 PM IST

లండన్​కు చెందిన ఓ వ్యక్తి.. కార్​ బూట్​ సేల్​కు​(అనవసరమైన వస్తువులను అమ్మే ప్రదేశం) వెళ్లాడు. అక్కడ ఓ స్పూన్​ను చూశాడు. అది చాలా పాతగా, తుప్పుపట్టినట్టు, సగం ఒంగిపోయినట్టు ఉంది. కానీ దానిని చూసిన వెంటనే, అందులో ఏదో ప్రత్యేకత ఉందని ఆ వ్యక్తికి అనిపించింది. ఇక ఆ చెంచాను కేవలం 90 పైసలకు కొన్నాడు.

90-paisa-spoon-sold-for-2-lakhs
90 పైసల చెంచాకు.. రూ. 2 లక్షలు

ఆ తర్వాత.. దానిని వేలానికి పెట్టాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి.. సోమర్​సెట్​లోని లారెన్స్​ ఆక్షనీర్స్​ను సంప్రదించాడు. అక్కడే ఉన్న ఓ నిపుణుడు ఆ 5 ఇంచుల చెంచాను క్షుణ్ణంగా పరిశీలించాడు. అనంతరం అది 13వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించాడు. వేలంలో.. ఆ స్పూన్​ ప్రారంభ ధర రూ. 51,712గా నిర్ణయించాడు.

ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ చెంచా ఆన్​లైన్​ వేలానికి వెళ్లింది. దానికి భారీ డిమాండ్​ లభించింది. ఆ పాత, సగం ఒంగిపోయిన స్పూన్​ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. లక్షలు కుమ్మరించారు. చివరికి ఆ స్పూన్​ రూ. 1,97,000కు అమ్ముడుపోయింది. ఇక పన్నులు, ఇతర ఛార్జీలను కలుపుకుని మొత్తం రేటు రూ. 2లక్షలు దాటిపోయింది.

ఇలా.. సరదాగా కార్​బూట్​ సేల్​కు వెళ్లి 90పైసలకు స్పూన్​ కొన్న ఆ వ్యక్తి.. 12వేల రెట్లు ఎక్కువకు దానిని అమ్మేశాడు.

ఇదీ చూడండి:- ఆమ్లెట్ కోసం గుడ్డు పగలగొడితే కోడిపిల్ల వచ్చింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.