1981 జులై 29.. ప్రిన్సెస్ డయానా- ప్రిన్స్ ఛార్లెస్ వివాహం జరిగిన రోజు. వారి వివాహ వేడుకలో ఉపయోగించిన ఎన్నో వస్తువులు ప్రపంచవ్యాప్తంగా పలు మ్యూజియాల్లో కొలువుదీరాయి. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఓ అపురూపమైన వస్తువు వేలానికి వచ్చింది.
ఏంటా వస్తువు?
బ్రిటిష్ రాజకుటుంబ వారసుడైన ప్రిన్స్ ఛార్లెస్ వివాహానికి గుర్తుగా 'వెడ్డింగ్ కేక్ కటింగ్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆనాటి వారి వివాహ వేడుకలో కోసిన ఎంతో ప్రత్యేకమైన ఈ కేక్‌లోని ఓ ముక్క వేలానికి వచ్చింది. 40 ఏళ్ల నాటి ఈ కేక్‌కు 300 పౌండ్లు(రూ.40వేలు) నుంచి 500 పౌండ్లు(రూ.52వేలు) మధ్య ధర పలకొచ్చని అంచనా.
అలా వేలానికి..
రాయల్ వెడ్డింగ్ అల్పాహారం కార్యక్రమం అనంతరం ఈ కేక్ నుంచి ఓ ముక్క రాజకుటుంబానికే చెందిన 'క్లారెన్స్ హౌస్'లోని రాణి తల్లి కుటుంబ సభ్యురాలైన 'మొయిరా స్మిత్'కు వద్దకు చేరింది. ఆమె దానిని ప్రత్యేకంగా తయారు చేసిన టిన్‌లో భద్రపరచారు. అయితే స్మిత్ కుటుంబం 2008లో దీనిని విక్రయించింది. షుగర్ కోటింగ్‌తో ఉన్న ఈ కేక్‌ను బంగారం, ఎరుపు, నీలం, వెండి రంగులతో అలంకరించారు.
'ఈ కేక్ చూసేందుకు బాగానే ఉన్నట్లు కనిపిస్తోందని.. అయితే దీనిని తినకూడదని' డొమినిక్ వింటర్ ఆక్షనర్ సంస్థ సీనియర్ డైరెక్టర్ క్రిస్ ఆల్బరీ తెలిపారు.
ఇవీ చదవండి: