కరోనా వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌లో పర్యటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. వైరస్‌పై యుద్ధంలో వుహాన్ ప్రజల పాత్రను అభినందించారు. పరిస్థితి అదుపులోనే ఉందని స్పష్టం చేసిన అధ్యక్షుడు.. కరోనాపై పోరులో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హుబే రాష్ట్రంలోని వుహాన్‌లో జిన్‌పింగ్ పర్యటించడం ఇదే తొలిసారి. ఆయన వెంట ఆరోగ్యశాఖ అధికారులు, సైనికులు ఉన్నారు. తొలుత ఆసుపత్రుల్లోని పరిస్థితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిన్‌పింగ్.. అనంతరం వుహాన్ వీధుల్లో పర్యటించారు. భవనాల్లో ఉన్న వారికి అభివాదం చేసి.. వారిలో ధైర్యం నింపారు.
కరోనా వైరస్‌తో చైనా స్తంభించింది. ఇప్పటివరకు 80వేల మందికి కరోనా సోకింది. 3,136మంది మరణించారు.
వైరస్ విజృంభించిన తొలినాళ్లల్లో.. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు జిన్‌పింగ్. అనంతరం ఆసుపత్రి నిర్మాణాలు, వైరస్ నియంత్రణకు చేసిన కృషితో అనేక మంది నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ఇదీ చూడండి:- కరోనాతో ఇరాన్లో మరణాలు- ఇండోనేసియాలో అరెస్టులు