ETV Bharat / international

ఉత్తరకొరియా పర్యటనలో జిన్​పింగ్​

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్​యాంగ్​కు చేరుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ . ఆ దేశ అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​తో భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై చర్చించనున్నారు.

ఉత్తరకొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​
author img

By

Published : Jun 20, 2019, 11:11 AM IST

Updated : Jun 20, 2019, 1:08 PM IST

ఉత్తరకొరియా పర్యటనలో చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్​యాంగ్​కు చేరుకున్నారు. చారిత్రకమైన ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ కోసం కిమ్​ జోంగ్ ఉన్​తో చర్చించనున్నారు జిన్​పింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఇరువురు నేతలు భేటీ కావడం గమనార్హం.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో చైనా-ఉత్తర కొరియా మిత్రదేశాలుగా ఉన్నాయి. తరువాత ప్యాంగ్​యాంగ్ అణుకార్యక్రమాలపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. ఐరాస ఆంక్షలను సమర్థించిన చైనా... మిత్రదేశం ఉత్తరకొరియాకు దూరమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాలో 14 ఏళ్ల తరువాత చైనా అధ్యక్షుడి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా పావులు కదుపుతోంది చైనా. అందులో భాగంగా ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల సడలింపుపై ఐరాసలో పట్టుబట్టే అవకాశం ఉంది.

ఉత్తరకొరియా పర్యటనకు తన సతీమణితో సహా వెళ్లిన జిన్​పింగ్​కు అక్కడ ఘనస్వాగతం లభించింది. వీరితో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​యీ కూడా ఉన్నారు.

ఇదీ చూడండి: బోధి వృక్షం నుంచి జలధారలు..!

Kathmandu (Nepal), June 19 (ANI): Thousands of people have gathered in Nepal demanding the government to scrap the controversial Guthi Bill. The Nepal government in April tabled a bill through the Ministry of Land Management, Cooperatives and Poverty Alleviation at Upper House which proposes consolidation of all acts and amendments related to 'Guthis'. But the bill which came out without consultation and proper discussion with concerned parties has made people spill onto the streets. Local residents of Kathmandu Valley, especially the Newar Community who have serious dissatisfaction over the bill, are carrying out continuous protests, mass meetings and rallies since June 9. They claim the bill will strip them off their rights of continuing the culture that has been followed for a long time. It might also result in extinction of various age-old culture and traditions. With the rage against the controversial bill rising, the protest also has got support from member of other groups who grew up in Newari culture. The Ministry for Land Management, Cooperatives and Poverty Alleviation which had tabled the bill withdrew it on Tuesday but still failed to win the trust of the natives of Kathmandu valley. The protest involved participation in thousands, with people raising slogans against the incumbent government led by KP Sharma Oli.
Last Updated : Jun 20, 2019, 1:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.