ETV Bharat / international

అబ్బే.. మాకు, కరోనా​కు సంబంధమే లేదు: వుహాన్​ ల్యాబ్​ - యూఎస్​ చైనా తాజా వార్తలు

కరోనా వైరస్‌ చైనా వుహాన్‌ ప్రయోగశాల నుంచే వ్యాపించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్నారు. చాలా దేశాలు ఇలాంటి అనుమానాల్నే వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను చైనా వుహాన్​ ల్యాబ్​ డైరక్టర్​ వాంగ్​ యానీ ఖండించారు. అసలు తమకు, ఆ వైరస్​కు సంబంధమే లేదని చెప్పుకొచ్చారు.

VIRUS-US-CHINA-WIV
అబ్బే.. మాకు ఆ వైరస్​కు సంబంధమే లేదు: వుహాన్​ ల్యాబ్​
author img

By

Published : May 24, 2020, 1:02 PM IST

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌లోనే పుట్టిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా కల్పితమని ల్యాబ్‌ డైరక్టర్‌ వాంగ్‌ యానీ స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ ప్రబలే వరకు దాని ఉనికే తమకు తెలియదన్నారు. ఆ వైరస్‌పై ఎప్పుడూ పరిశోధన కూడా చేయలేదని చెప్పుకొచ్చారు వాంగ్​. తమ దగ్గర వైరస్‌ లేనప్పుడు ఎలా బయటపడుతుందని ప్రశ్నించారు. అసలు అలాంటి వైరస్‌ ఒకటి ఉందని కూడా తమకు తెలియదన్నారు.

అయితే కరోనా ఆ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌, విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ వైరస్‌కు మూలం గబ్బిలాలే అని, వాటి నుంచి కొన్ని మధ్యవర్తి జీవుల ద్వారా మానవులకు సోకిందని అనేక మంది శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.