ETV Bharat / international

ఆ నగరంలో కోటి మందికి కరోనా పరీక్షలు! - పది రోజుల యుద్ధం

వుహాన్​లో కరోనాను పూర్తిగా రూపుమాపడానికి చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని 1.1 కోట్ల మంది ప్రజలకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కేవలం పది రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.

coronavirus in china
చైనాలో కరోనా
author img

By

Published : May 12, 2020, 8:01 PM IST

కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్​లో చైనా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో నివసిస్తున్న మొత్తం 1.1 కోట్ల మంది ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. దీనికి సంబంధించి '10 రోజుల యుద్ధం' అనే పేరుతో అంతర్జాలంలో ఒక డాక్యుమెంట్ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొంది.

వుహాన్​లోని ప్రతి జిల్లా అధికారులు 10 రోజుల ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సదరు వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా ప్రభావం ఉన్నా, లేకున్నా.. జిల్లాలోని జనాభాను బట్టి సొంతంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొంది. ఈ పరీక్షల్లో భాగంగా అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు సహా వృద్ధులకు తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.

ఆచరణ సాధ్యం కాదు

మరోవైపు ఈ విషయంపై చైనా వైద్య శాఖ సీనియర్ అధికారులు స్పందించారు. నగరంలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇందుకు భారీగా వ్యయం అవుతుందని పేర్కొన్నారు.

వైద్య సిబ్బంది కోసమా?

అయితే ఈ పరీక్షలు కరోనాతో పోరులో కీలకంగా వ్యవహరించిన వైద్య సిబ్బందితో పాటు రోగి సన్నిహితులే లక్ష్యంగా నిర్వహించే అవకాశం ఉందని వుహాన్​ విశ్వవిద్యాలయ పరిధిలోని ఝోంగ్నన్ ఆస్పత్రి అత్యవసర విభాగాధిపతి పెంగ్ ఝియోంగ్ అభిప్రాయపడ్డారు.

10 రోజుల్లో సాధ్యమే

వుహాన్​లో ఉన్న 30-50 లక్షల మంది ప్రజలకు ఇదివరకే పరీక్షలు నిర్వహించినట్లు విశ్వవిద్యాలయానికి చెందిన మరో డైరెక్టర్ తెలిపారు. అందువల్ల మరో 10 రోజుల్లో 60-80 లక్షల మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అన్నారు.

వుహాన్​లో తాజాగా ఆరు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ఈ వార్తలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి వుహాన్​లో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు. చైనాలో ఇప్పటివరకు మొత్తం 84,001 మంది కొవిడ్ బారిన పడగా.. 4,637 మంది మృతి చెందారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.