ETV Bharat / international

కరోనా​ విలయం.. 83 లక్షలు దాటిన కేసులు

ప్రపంచ దేశాలపై కరోనా విలయతాండవం ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా ఇప్పటివరకు 83లక్షల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు. 4లక్షల 47వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

CORONAVIRUSCASES AND DEATH TOLL
కొవిడ్​ విలయం.. 83 లక్షలు దాటిన బాధితులు
author img

By

Published : Jun 17, 2020, 9:28 PM IST

Updated : Jun 17, 2020, 9:36 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం నాటికి వైరస్​ బాధితుల సంఖ్య 83లక్షలు దాటిపోయింది. ఇప్పటివరకు 83,10,872మంది వైరస్​ బారిన పడ్డారు. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మొత్తం 4,47,362 మంది వైరస్​ బారినపడి మృతి చెందారు.

కరోనా​ ఉద్ధృతి కొనసాగుతోందిలా..

  • రష్యాలో కరోనా కేసులు 5.5 లక్షలు దాటాయి. గడచిన 24గంటల్లో 7,843మందికి వైరస్​ సోకింది. మరో 194మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. ఆ దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 5,53,301కు చేరగా.. 7,478 మంది మరణించారు.
  • మెక్సికోలో కొవిడ్​ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,599 మంది మహమ్మారి బారినపడగా.. 730 మంది మృతిచెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 18,310కు చేరింది. ఇప్పటివరకు ఆ దేశంలో 1,54,863 వైరస్​ కేసులు వెలుగుచూశాయి.
  • పాకిస్థాన్​​లో వైరస్​ విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 5,839 వైరస్​ కేసులు నమోదవ్వగా.. 136 మంది చనిపోయారు. ఇప్పటివరకు పాక్​లో మొత్తం 1,54,760 మందికి కొవిడ్​ సోకగా.. 2,975 మరణాలు నమోదయ్యాయి.
  • బంగ్లాదేశ్​లో బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4వేలకుపైగా వైరస్​ కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. మరో 43మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు బంగ్లాలో 98,489 మందికి కరోనా సోకగా.. 1,305 మంది మరణించారు.
  • సౌదీ అరేబియాలో ఒక్కరోజు వ్యవధిలో 4,919 కరోనా కేసులు బయటపడగా.. మరో 39మంది మృతి చెందారు. ఇప్పటివరకు సౌదీలో మొత్తం 1,41,234 వైరస్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,091కు చేరింది.
  • ఇరాన్​లో 24 గంటల వ్యవధిలో మరో 2,612 మందికి వైరస్​ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 2లక్షలకు చేరువైంది. మరో 120మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో 1,95,051 వైరస్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం 9,185మంది మరణించారు.
  • నేపాల్​లో కరోనా కోరలు చాస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 586మందికి వైరస్​ సోకింది.
  • సింగపూర్​లో ఒక్కరోజులో 247 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 41,216 కు చేరింది. ఇప్పటివరకు అక్కడ మొత్తం 20మంది వైరస్​ సోకి ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: కరోనా వల్ల వీరికి 12రెట్లు ప్రమాదం ఎక్కువ!

Last Updated : Jun 17, 2020, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.