ETV Bharat / international

పాకిస్థాన్​కు ప్రపంచ బ్యాంక్ భారీ రుణం

విపత్తులు, ఆరోగ్య అత్యయిక పరిస్థితులతో అల్లాడుతున్న పాకిస్థాన్​ను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంక్ మరోసారి ముందుకొచ్చింది. ఆ దేశానికి 300 మిలియన్​ డాలర్ల అప్పు అందించేందుకు ఆమోదం తెలిపింది.

author img

By

Published : Dec 10, 2020, 9:31 PM IST

World Bank approves $300m loan for Pakistan
పాకిస్థాన్​కు ప్రపంచ బ్యాంకు నుంచి భారీ రుణం

పాకిస్థాన్​కు 300 బిలియన్​ డాలర్ల రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదం తెలిపిందని ఆ దేశ వార్తా సంస్థ పేర్కొంది. వాతావరణ సమస్యలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నుంచి రక్షణ కోసం, కరాచీలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఈ నిధులను అందించిందని వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ స్థానిక కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రకటనను వార్తా సంస్థ ప్రస్తావించింది.

"విపత్తుల నుంచి, ఆరోగ్య అత్యయిక పరిస్థితుల నుంచి పాకిస్థాన్​ బయటపడటం అత్యంత అవసరం. అప్పుడే.. ఆ దేశ ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థను కాపాడగలుగుతాం."

-నాసీ బెన్​హాస్సిన్, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి​, పాకిస్థాన్​

ఈ నిధుల్లో 200 మిలియన్​ డాలర్లను సింధ్​ రాష్ట్రంలో వరదలు, కరవు వంటి విపత్తుల నుంచి పునరుజ్జీవం కోసం వినియోగించనుంది పాక్. కరాచీలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం 100 మిలియన్​ డాలర్ల నిధులను ఉపయోగించనుంది.

ఈ ఏడాది జూన్​లో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి 500 మిలియన్​ డాలర్ల చొప్పున రుణాన్ని అందుకుంది పాకిస్థాన్.

ఇదీ చూడండి:గేట్స్​ ఫౌండేషన్ మరో భారీ సాయం ​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.