బంగ్లాదేశ్‌కు చెందిన అరీఫా సుల్తానా అనే మహిళ ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన 26 రోజులకు అకస్మాతుగా అనారోగ్యానికి గురైంది. హుటాహుటిన అసుపత్రికి తరలించగా తర్వాత జరిగిన సంఘటనతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. నెల తిరగకుండానే అసిఫా మరో కాన్పులో కవలలకు జన్మనిచ్చింది. ఇలాంటి సంఘటన వైద్య చరిత్రలోనే ఇప్పటి వరకు జరగలేదని డాక్టర్లు తెలిపారు.
రెండు గర్భాశయాలు
అరిఫా కడుపులో రెండు గర్భాశయాలు ఉన్నట్లు 'అల్ట్రాసోనోగ్రఫీ' పరీక్ష ద్వారా గుర్తించామని గైనకాలజిస్ట్ తెలిపారు. 26 రోజుల ముందు అసిఫా ప్రసవించినపుడు ఒక గర్భాశయంలో ఉన్న మగబిడ్డను ఆపరేషన్ ద్వారా బయటకి తీశారు. అప్పుడు రెండో గర్భాశయాన్ని వైద్యులు గుర్తించలేదు.
రెండో కాన్పులో అసిఫాకు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించి కవలలను బయటికి తీశారు వైద్యులు.
రెండుసార్లూ నెలలు నిండక ముందే ప్రసవం జరిగింది.
మహిళకు రెండు గర్భాశయాలు ఉండటం చాలా అరుదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:ఏనుగు అలిగింది... తొమ్మిది కార్లు నలిగాయి!