ETV Bharat / international

బుర్జ్​ ఖలీఫాపై మహిళ.. చూస్తే గుండె జారిపోవాల్సిందే! - ఎమిరేట్స్​ యాడ్​ వైరల్​

ఓ మహిళ.. ప్రపంచంలోనే ఎత్తైన టవర్​ బుర్జ్​ ఖలీఫాపైన నిలబడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ వీడియో చూసిన వాళ్లకు గుండె జారిపోయినంత పని అవుతోంది.

emirates
ఎమిరేట్స్​
author img

By

Published : Aug 10, 2021, 11:17 AM IST

సాధారణంగా.. 10 అంతస్తుల భవనంపైన నుంచి కిందికి చూస్తేనే కళ్లు తిరిగినట్లు అవుతుంది. ఆచితూచి నడవకపోతే ఇక అంతే! అనుకుని జాగ్రత్తపడుతుంటాం. కానీ ఓ మహిళ ఏకంగా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్​ మీద ధైర్యంగా నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియో చూస్తే కచ్చితంగా గుండె జారిపోతుంది!

క్రియేటివ్​ ఐడియా..!

ఇటీవలే.. బ్రిటన్​ ప్రభుత్వం కొవిడ్​ ఆంక్షలను కొంత సడలించింది. కొన్ని దేశాలతో జాబితాను రూపొందించి.. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్​ ఉండదని పేర్కొంది. ఆ జాబితాలో యూఏఈ కూడా ఉంది. ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రముఖ ఎయిర్​లైన్స్​ సంస్థ ఎమిరేట్స్​ తనదైన శైలిలో ఓ యాడ్​ను రూపొందించింది. ఈ 33సెకన్ల యాడ్​లో.. ఓ మహిళ ఎమిరేట్స్​ యూనిఫాం వేసుకుని, 'యూకే జాబితాలో యూఏఈ ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆకాశం అంచున ఉన్నట్టు అనిపిస్తోంది' అన్న సందేశం వచ్చే విధంగా ప్లకార్డులు పట్టుకుని బుర్జ్​ ఖలీఫాపైన నిలబడింది. దాదాపు క్లోజ్​అప్​లోనే వీడియో ఉండగా.. చివరి కొద్ది సెకన్లు మాత్రమే.. ఒక్కసారిగా కెమెరాను లాంగ్​ షాట్​లోకి తీసుకెళ్లేసరికి.. ఒక్కసారి గుండె జారిపోయిన ఫీలింగ్​ చూసినవారికి కలుగుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యాడ్​ను చూస్తే ఇది గ్రాఫిక్స్​ ఏమో? అనుకునే వాళ్లూ ఉంటారు. అందుకే వారి కోసం యాడ్​ మేకింగ్​ వీడియోను కూడా విడుదల చేసింది ఎమిరేట్స్​. ఆ మహిళ పేరు నికోల్​ స్మిత్​-లడ్విక్​ అని, ఆమె ఓ స్కైడైవింగ్​ శిక్షకురాలని వివరించింది.

యాడ్​పై నికోల్​ కూడా స్పందించింది. "నేను చేసిన స్టంట్స్​లో అత్యంత అద్భుతమైన స్టంట్​ ఇదే. ఇంతటి గొప్ప క్రియేటివ్​ ఐడియాను రూపొందించినందుకు ఎమిరేట్స్​కు అభినందనలు. యాడ్​లో భాగం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అని తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది.

ఇదీ చూడండి:- జంతువులే ఆశ్చర్యపోయేలా.. జూలో కొట్టుకున్నారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.