అఫ్గాన్ తాలిబన్ల వశం కావడం వల్ల అక్కడ లభించే విలువైన 'రేర్ ఎర్త్స్' ఖనిజాలపై చైనా కన్నేసింది. కంప్యూటర్లు, రీఛార్జబుల్ బ్యాటరీలు, పవన విద్యుత్తు టర్బయిన్లు, హైబ్రిడ్ కార్లు, టెలివిజన్లు, సూపర్ కండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక పరికరాల తయారీకి వీటి అవసరం ఎంతగానో ఉంది. ఇప్పటికే ప్రపంచంలోని 85 శాతం రేర్ ఎర్త్స్ ఖనిజాలను సొంతం చేసుకున్న చైనా ఇప్పుడు వీటి పైనా గురి పెట్టిందని అప్లాన్ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో పెట్రోలియం బావులు, రాగి గనుల తవ్వకాలపై ఆ దేశంతో ఒప్పందాలు కుదుర్చుకొంది. అనుకూల ప్రభుత్వం రాగా.. మరింతగా ముందుకు వెళ్లనుందన్న అంచనాలు ఉన్నాయి. చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి హువా చినోయుంగ్ మాట్లాడుతూ తాలిబన్లు మారారని చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయితే గుర్తింపు ఇస్తామన్నారు.
ఇదీ చూడండి: ఐరాస వేదికగా పాక్- చైనాకు జైశంకర్ చురకలు
ఇదీ చూడండి: దక్షిణాసియాపై 'డ్రాగన్' వల- భారత్ లక్ష్యంగా కొత్త కూటమి