ETV Bharat / international

మరో 3 రోజులే.. తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచం గుర్తిస్తుందా? - kabul

ఆగస్టు 31లోపు అమెరికా దళాలు అఫ్గాన్​ను వీడటం ఖాయం. ఆ తర్వాత తాలిబన్లు ప్రభుత్వాన్ని(taliban government news) ఏర్పాటు చేయడం లాంఛనమే! అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తాయా లేదా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

taliban
తాలిబన్​
author img

By

Published : Aug 28, 2021, 7:10 PM IST

ఆగస్ట్​ 31.. ఆఫ్గాన్​ నుంచి అమెరికా దళాల ఉపసంహరణకు డెడ్​లైన్​ ఇది. మరో మూడు రోజుల్లో అమెరికా అన్నీ సర్దుకుని వెళ్లిపోవాలి. కాబుల్​ ఆత్మహుతి దాడుల అనంతరం ఎన్నో దేశాలు పౌరులు తరలింపు ప్రక్రియను కూడా నిలిపివేశాయి. 31వ తేదీ సమీపిస్తున్నకొద్దీ.. తర్వాత ఏంటి? అన్న సందేహం ఉత్పన్నవుతోంది. అఫ్గాన్​లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు(taliban government news) చేయడం ఖాయం! తేదీ ప్రకటించడం ఒక్కటే మిగిలింది. అయితే.. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎన్ని దేశాలు గుర్తిస్తాయన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న.

ఇంతకీ ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాల వైఖరేంటి?

అమెరికా...

తాలిబన్ల రాజ్యాన్ని ఇప్పట్లో గుర్తించే ప్రసక్తే లేదని అమెరికా(us taliban news) తేల్చిచెబుతోంది. ఆ ప్రభుత్వానికి గుర్తింపునివ్వాలంటే.. తాలిబన్లు కొన్ని హమీలు ఇవ్వాలని ఇప్పటికే స్పష్టం చేసింది. వీటిల్లో ఉగ్రవాదం, మహిళల స్వేచ్ఛ అంశాలు కీలకంగా ఉన్నాయి.

తమ మిత్రదేశాలు కూడా ఇదే వైఖరిని అవలంబించాలని అమెరికా కోరుకుంటోంది.

భారత్​..

అఫ్గాన్​ సంక్షోభాన్ని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడ పరిస్థితులు తాము అనుకున్న విధంగా లేవని, తాలిబన్ల(india taliban relations) ప్రభుత్వాన్ని గుర్తించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శుక్రవారం స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పౌరుల తరలింపు ప్రక్రియపైనే దృష్టిసారించినట్టు పేర్కొంది.

చైనా..

అఫ్గాన్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న నాటి నుంచి.. వారి పట్ల చైనా సానుకూలంగానే ఉంది. ఇప్పటికే తాలిబన్లతో దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకుంది. వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ కూడా ఇచ్చేసింది. వీటన్నింటినీ చూస్తే.. తాలిబన్ల ప్రభుత్వాన్ని చైనా గుర్తించడం లాంఛనమే!

ఇదీ చూడండి:- Afghan crisis: అఫ్గాన్​ సంక్షోభంతో భారత్​కు కొత్త చిక్కులు

రష్యా...

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రష్యా వెల్లడించింది. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. మఖ్యంగా భద్రత పరంగా తాలిబన్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాన్ని పరిగణిస్తామని స్పష్టం చేసింది. అఫ్గాన్​లో శాంతి భద్రతలు కోరుకుంటున్నట్టు తెలిపింది.

పాకిస్థాన్​..

ఈ వ్యవహారంపై పాకిస్థాన్​ ఆచితూచి అడుగులు వేస్తోంది(pak taliban relations). చైనా, టర్కీ వంటి ఆసియా ప్రాంతాల్లోని ఇతర దేశాలతో ఈ విషయాన్ని చర్చించిన అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.

వాస్తవానికి 1996లో తాలిబన్లు అఫ్గాన్​ను ఆక్రమించుకున్నప్పుడు, వారి ప్రభుత్వాన్ని తొలుత గుర్తించింది పాకిస్థానే. ఇప్పుడు కూడా తాలిబన్లతో పాక్​కు సత్సంబంధాలే ఉన్నాయి! తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్​ ప్రజలు.. బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందారని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వ్యాఖ్యానించడం ఇందుకు ఉదాహరణ. అయితే తాలిబన్ల గుర్తింపుపై ఆసియాలో ఇతర దేశాలేవీ స్పష్టమైన వైఖరిని బయటపెట్టలేదు. ఈ నేపథ్యంలో పాక్​ ముందే ప్రకటిస్తే.. ఇతర దేశాల నుంచి ఇక్కట్లు తలెత్తే అవకాశం ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.

బ్రిటన్​..

తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే విషయం.. వ్యక్తిగతంగా కాకుండా, అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా జరగాలని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఇటీవలే వ్యాఖ్యానించారు. మానవ హక్కులు, శాంతికి తాలిబన్లు కట్టుబడి ఉంటేనే ఇది జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

గుర్తింపు ఎందుకు?

అఫ్గాన్​ను నడిపించాలంటే ప్రపంచ దేశాల గుర్తింపు తాలిబన్లకు ఎంతో అవసరం. ప్రజాస్వామ్య పాలన కుప్పకూలిన వెంటనే.. అఫ్గాన్​కు అందించే నిధులను నిలిపివేసింది అమెరికా. అగ్రరాజ్యంలోని అఫ్గాన్​ ప్రభుత్వ ఆస్తులను కూడా జప్తుచేసింది. అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్​), ప్రపంచ బ్యాంక్​ కూడా నిధులను అడ్డుకుంది. ఇదే కొనసాగితే తాలిబన్లకు కష్టమవుతుంది.

అందుకే ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తహతహలాడుతూ శాంతి మంత్రాన్ని జపిస్తోంది తాలిబన్​ బృందం. భారత్​ సహా పొరుగు దేశలతో స్నేహబంధాన్నే కోరుకుంటున్నట్టు చెబుతోంది.

తమ ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు తాలిబన్లు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. 31వ తేదీ తర్వాత... కాబుల్​లో తమ రాయబార కార్యాలయాన్ని పునరుద్ధరించాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు. దీనిపై అగ్రరాజ్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇదీ చూడండి:- ఖాళీ ఏటీఎంలు, ఆకలి కేకలు- అఫ్గాన్​లో ప్రజల నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.