ETV Bharat / international

ఆస్ట్రేలియాలో వర్ష బీభత్సం- లక్షల మందికి అవస్థలు

author img

By

Published : Jun 10, 2021, 3:35 PM IST

ఆస్ట్రేలియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలను వరద ముంచెత్తింది. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేలకూలాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Australia floods
ఆస్ట్రేలియా వరదలు
ఆస్ట్రేలియాలో వర్షాల బీభత్సం

చుట్టూ విరిగిపడిన భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు, ఇళ్లలో అలముకున్న అంధకారం, బయటకు వెళదామంటే కనుచూపు మేర వరద నీరు. అదే సమయంలో... కొన్ని చోట్ల భారీగా కురుస్తున్న మంచు, వణికించే చలిగాలులు. ఇదీ ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతంలోని విక్టోరియా, న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రాల్లో ప్రజల పరిస్ధితి.

విక్టోరియా రాష్ట్రంలో బుధవారం 20 సెంటీమీటర్ల వర్షం కురవగా, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. దీంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వరద నీరు, కొండ చరియలు విరిగిపడటం వల్ల రహదారులను అధికారులు మూసివేశారు. విక్టోరియాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

విక్టోరియాలో 2008 తర్వాత ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

అక్కడ మంచు..

న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రం మంచు గుప్పిట చిక్కుకుంది. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హిమపాతం కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

ఈ రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి అవసరమైన సాయం అందిస్తోంది. కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలను తొలగించే పనిని అధికార యంత్రాంగం వేగవంతం చేసింది.

ఇదీ చూడండి: కరెంటు స్తంభంలో​ ఇరుక్కున్న ఎలుగుబంటి.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.