చైనాలో తయారు చేసిన రెండో కరోనా టీకా 'సినోవాక్' అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మంగళవారం ఆమోదం తెలిపింది. భద్రత, సామర్థ్యం, తయారీకి ఈ వ్యాక్సిన్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని వివరించింది.
సినోవాక్‌ను బీజింగ్‌కు చెందిన ఫార్మా సంస్థ సినోవాక్ బయోటెక్ తయారు చేసింది. చైనా తయారు చేసిన తొలి కొవిడ్ టీకా సినోఫార్మ్ అత్యవసర వినియోగానికి మే7న డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది.
ఇదీ చూడండి: చైనా వస్తువులే కాదు టీకా కూడా నాసిరకమే!