సింగపూర్‌లో కరోనా కొత్త వేరియంట్‌గా పేర్కొంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై భారత స్పందనను సింగపూర్ ప్రభుత్వం ప్రశంసించింది. భారత్ స్పష్టతకు తాము సంతృప్తి చెందినట్లు పేర్కొంది. రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సింగపూర్ హైకమిషనర్ అన్నారు.
" సింగపూర్‌లో వెలుగు చూసిన కరోనా కొత్త రకం పిల్లల్లో ఎక్కువగా ప్రభావం చూపుతోందని తేలింది. అది భారత్‌లోకి మూడో దశ రూపంలో రాబోతోంది. కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 1. సింగపూర్ విమానాలను తక్షణమే రద్దు చేయాలి. 2. పిల్లలకు వ్యాక్సిన్ అందించే అంశాన్ని పరిశీలించాలి. " అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇది ఇరు దేశాల మధ్య ధౌత్యపరమైన చర్చకు దారితీసింది.
కేజ్రీవాల్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సింగపూర్ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో దిల్లీ ముఖ్యమంత్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. దేశం తరఫున మాట్లాడాల్సింది దిల్లీ ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. విద్యా సంస్థలు ధ్వంసం