పాకిస్థాన్ సైన్యం మరోసారి తన తలబిరుసుతనాన్ని ప్రదర్శించింది. ఏ దేశంపైనా అణ్వస్త్ర దాడులు మొదటిగా మొదలుపెట్టకూడదన్న నియమం తమకు లేదని స్పష్టం చేసింది. 'కశ్మీర్' అంశంపై భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రధాని వర్సెస్ సైన్యం
పాక్ సైన్య అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ' అణ్వాయుధాలు మొదటిగా ప్రయోగించకూడదనే నియమం పాకిస్థాన్‌కు లేదు' అని తాజాగా ప్రకటించారు. ఇదే అంశంపై ఇటీవలే స్పందించిన పాక్ ప్రధాని.. భారత్‌తో అణుయుద్ధాన్ని పాక్ మొదలుపెట్టదన్నారు. పాక్ సైన్యం ప్రకటన.. ఇమ్రాన్ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.
'కశ్మీరం'పైనే రగడ
భారత్ ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు విభజించింది. దీనిపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయంగా నానా రభస సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. అయితే కశ్మీర్ పూర్తిగా తమ అంతర్గత విషయమని భారత్ ఇప్పటికే ప్రపంచదేశాలకు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: భారత్-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు