ETV Bharat / international

'కొవిడ్-19' కాటుకు ఒక్కరోజే 242 మంది బలి!

ప్రపంచాన్ని ప్రాణాంతక 'కొవిడ్-19' తీవ్రంగా వణికిస్తోంది. వైరస్ కేంద్రస్థానమైన చైనాలో బుధవారం ఒక్కరోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,355కు చేరింది. 15 వేల నూతన కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.

corona
కరోనా కాటుకు ఒక్కరోజే 242మంది బలి!
author img

By

Published : Feb 13, 2020, 7:29 AM IST

Updated : Mar 1, 2020, 4:10 AM IST

ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది 'కొవిడ్-19'. వ్యాధి కేంద్రబిందువుగా భావిస్తోన్న చైనాలోని హుబే రాష్ట్రంలో ఒక్కరోజే 242 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 1,355 మంది ఈ ప్రాణాంతక వైరస్​కు బలయ్యారు. 15 వేల నూతన కేసులు నమోదయ్యాయని సమాచారం. దీనితో వ్యాధి సోకిన వారి సంఖ్య 60 వేలకు చేరింది.

'భారత్​.. మీ చొరవకు ధన్యవాదాలు'

'కొవిడ్-19' నియంత్రణలో భాగంగా ఓ చైనా జాతీయుడిని ప్రత్యేక శిబిరంలో ఉంచి వైద్య పరీక్షలు చేసింది భారత్. అతడికి వైరస్​ సోకలేదని నిర్ధరణ అయిన నేపథ్యంలో డిశ్చార్జీ చేసింది. ఈ నేపథ్యంలో తనకు చికిత్స చేసిన పుణె ఆసుపత్రి వర్గాలకు కృతజ్ఞతలు తెలిపాడు ఆ వ్యక్తి. సోదర భావంతో సేవ చేశారని పేర్కొన్నాడు.

'కొవిడ్-19'పై అమెరికా జాగ్రత్త...

వైరస్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం కోసం అమెరికా వ్యాప్తంగా కిట్లను అధికారులు సరఫరా చేశారు. ఇప్పటికే 200 కిట్లు ఆయా ప్రాంతాలకు పంపినట్లు వెల్లడించారు. అయితే కిట్లను ఉపయోగించి పరీక్షలు నిర్వహించినప్పుడు ఎలాంటి ఫలితం కనిపించడం లేదని సమాచారం.

ఇప్పుడే ఏమీ చెప్పలేం.. డబ్ల్యూహెచ్​ఓ

వైరస్​పై తాజాగా స్పందించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). ఈ సందర్భంగా కొవిడ్-19 తగ్గుముఖం పట్టిందని ఇప్పుడే ప్రకటించలేమని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: తల్లికి కరోనా వైరస్​.. మరి ఇప్పుడే పుట్టిన పాపకు?

Last Updated : Mar 1, 2020, 4:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.