ETV Bharat / international

చైనాపై మరోసారి ఆంక్షలు విధించిన అమెరికా

author img

By

Published : Jul 10, 2020, 7:08 PM IST

చైనాపై మరోసారి ఆంక్షలు విధించింది అగ్రరాజ్యం. ఈసారి జిన్​జియాంగ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆ దేశానికి చెందిన రాజకీయ నాయకులపై చర్యలు చేపట్టింది.

US sanctions senior Chinese officials over repression of minorities in restive Xinjiang
చైనాపై అమెరికా మరోసారి ఆంక్షలు

చైనాలోని జిన్‌జియాంగ్ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల పట్ల మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో ఆ దేశానికి చెందిన కొందరు రాజకీయ నాయకులపై అమెరికా ఆంక్షలు విధించింది. వీగర్ ముస్లింలు, మరికొన్ని వర్గాలను సామూహికంగా నిర్బంధించి.. వారిపై మతపరమైన హింసకు పాల్పడటం సహా బలవంతంగా సంతాన నిరోధక ఆపరేషన్లు చేయిస్తోందని చైనాపై ఆరోపణలున్నాయి.

రీజనల్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత చెన్ క్యుయాంగో, మరో ముగ్గురు అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధించారు. ఐతే జిన్‌జియాంగ్‌లో వీగర్ల పట్ల అలాంటి దుశ్చర్యలకు పాల్పడలేదంటూ చైనా ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా జిన్‌జియాంగ్‌లో విద్యా శిబిరాల పేరుతో సుమారు 10 లక్షల మందిని అధికారులు నిర్బంధించినట్లు ఆరోపణలున్నాయి.

తీవ్రవాదం, వేర్పాటువాదాలను అరికట్టేందుకు వొకేషనల్ ట్రైనింగ్ అవసరమంటూ ఈ నిర్బంధ శిబిరాలకు లక్షల మందిని తరలించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీలో శక్తిమంతమైన పొలిట్ బ్యూరో సభ్యుడు చెన్ క్యుయాంగో. ఇప్పటివరకు అమెరికా నుంచి ఆంక్షలు ఎదుర్కొన్నవారిలో అత్యున్నత స్థాయి అధికారి ఈయనేనని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చూడండి:యూపీలో కరోనా కట్టడికి 'మూడు రోజుల ప్రణాళిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.