ETV Bharat / international

కిమ్​కు ఏమైందో మాకు తెలియదు: అమెరికా - కిమ్​ జోంగ్​ ఉన్​

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​కు సంబంధించిన ఏ విషయంపైనా తమకు సమాచారం లేదన్నారు అమెరికా విదేశాగమంత్రి మైక్​ పాంపియో. అయితే ఉత్తర కొరియాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు వివరించారు.

US hasn't seen Kim Jong-un but closely watching regime: Pompeo
కిమ్​కు ఏమైందో మాకు తెలియదు: అమెరికా
author img

By

Published : Apr 30, 2020, 9:04 PM IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​కు ఏమైంది? గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రశ్న ఇది. ఆయన ఆనారోగ్యంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉత్తర కొరియా మౌనం పాటించడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. తాజాగా వీటిపై అమెరికా స్పందించింది. కిమ్​కు సంబంధించిన విషయాలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు అగ్రరాజ్య విదేశాంగమంత్రి మైక్​ పాంపియో. అయితే ఆ దేశంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.

"మేం కిమ్​ను చూడలేదు. ఇప్పటివరకు మా వద్ద ఎలాంటి నివేదికలు కూడా లేవు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. కిమ్​ చుట్టూ, ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందనే అంశంపై నిఘా పెట్టాం. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణ చేయాలన్న లక్ష్యం వల్ల అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం."

-- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.

ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు పాంపియో ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా దక్షిణ కొరియా మీడియా యోన్​హప్​ ఈ వివరాలను వెల్లడించింది.

అయితే కిమ్​ ఆరోగ్య పరిస్థితులపై తనకు అవగాహాన ఉందన్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కానీ ఇప్పుడప్పుడే ఆ విషయంపై స్పందించలేనన్నారు.

దక్షిణ కొరియా మాత్రం కిమ్​ అనారోగ్య వార్తలను తోసిపుచ్చింది. ఆయన 'సజీవంగా, క్షేమంగా' ఉన్నారని పేర్కొంది. ఉత్తర కొరియాలోని వోన్సాన్‌ ప్రాంతంలో బస చేసినట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.