ETV Bharat / international

కిమ్‌ జోంగ్ బతికే ఉన్నారు: కొరియా - south korea

ఉత్తర కొరియా అధినేత కింమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలను దక్షిణ కొరియా తోసిపుచ్చింది. ఆయన సజీవంగా, క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. తూర్పు తీర ప్రాంతం వోన్సాన్​లో ఉన్నారని తెలిపింది.

Kim Jong un is alive: South Korea
కిమ్‌ ‘సజీవం’గా ఉన్నారు
author img

By

Published : Apr 27, 2020, 6:52 AM IST

Updated : Apr 27, 2020, 8:23 AM IST

ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆచూకీ, ఆయన ఆరోగ్యంపై అయోమయం కొనసాగుతోంది. ఆయన తాజా పరిస్థితిపై అనేక ఊహాగానాలు, వార్తలు వస్తున్నాయి. కిమ్‌ చనిపోయి ఉండొచ్చని.. ఆయనకు కరోనా వైరస్‌ సోకి ఉండొచ్చని లేదా ఆ మహమ్మారి బారిన పకుండా ఉండేందుకు విడిగా ఉంటున్నారని.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. పొరుగునున్న దక్షిణ కొరియా మరోసారి వీటిని తోసిపుచ్చింది. ఆయన 'సజీవంగా, క్షేమంగా' ఉన్నారని పేర్కొంది. వోన్సాన్‌ ప్రాంతంలో బస చేసినట్లు తెలిపింది. మరోవైపు కిమ్‌కు సంబంధించినదిగా భావిస్తున్న ఒక రైలు ఆ ప్రాంతంలో ఆగి ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది.

ఈ నెల 15న కిమ్‌ తన తాత 108వ జయంతి కార్యక్రమానికి గైర్హాజరైనప్పటి నుంచి రకరకాల వదంతులు వస్తున్నాయి. ఆయన మరణించి ఉంటారని హాంకాంగ్‌ శాటిలైట్‌ ఛానల్‌ తాజాగా పేర్కొంది. దక్షిణ కొరియా అధ్యక్షుడికి విదేశీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న చుంగ్‌ ఇన్‌ మూన్‌ వీటిని ఖండించారు. ఈ నెల 13 నుంచి వోన్సాన్‌ ప్రాంతంలో కిమ్‌ బస చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద అంశాలేవీ ఆ దేశంలో వెలుగు చూడలేదని చెప్పారు.

వోన్సాన్ ప్రాంతంలో

'38 నార్త్‌' అనే వెబ్‌సైట్‌ తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల్లో.. కిమ్‌ ఉపయోగించే రైలు కనిపించింది. తూర్పు తీర ప్రాంతంలో ఆయనకు సంబంధించిన వోన్సాన్‌ ప్రాంగణంలోని లీడర్‌షిప్‌ రైల్వే స్టేషన్‌లో అది ఆగి ఉంది. ఈ రైలు 250 మీటర్ల పొడవు ఉంది. ఈ నెల 21, 23 తేదీల్లో తీసిన చిత్రాల్లో అది ఉంది. దీన్నిబట్టి 21కి ముందే ఈ రైలు అక్కడికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. 23న ఆ రైలు తిరుగు ప్రయాణం కోసం దిశను మార్చుకుంది. కానీ అక్కడి నుంచి కదలలేదు. దీంతో తూర్పు తీరంలో కిమ్‌ బస చేస్తున్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది. అయినా ఆయన ఆరోగ్యంపై వదంతులు ఆగడం లేదు. వీటిపై ఉత్తర కొరియా అధికారిక మీడియా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అయోమయానికి గురి చేస్తోంది.

కిమ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శిఖరాగ్ర సదస్సు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఛైర్మన్‌ నుంచి కిమ్‌కు తాజాగా శుభాకాంక్షలు అందాయని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ శనివారం పేర్కొంది.

కిమ్‌ ఆరోగ్యంపై వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఇప్పటికే ఒక వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. తాజా పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని ఆ దేశం అధికారులు తెలిపారు. కిమ్‌ మరణించారని నిర్దిష్ట నిఘా సమాచారమేదీ లేదని వారు వివరించారు. కిమ్‌ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇప్పటికే పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కిమ్‌ అలా కావడానికి కారణం జున్ను!

Last Updated : Apr 27, 2020, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.