ETV Bharat / international

కొరియాలోని అమెరికా జవానుకు కరోనా.. - కొరియాలోని అమెరికా జవానుకు కరోనా

దక్షిణ కొరియాలోని అమెరికా బలగాల్లో ఓ జవానుకు కరోనా వైరస్​ సోకినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అమెరికా భద్రతా దళాల్లో నిర్ధరణ అయిన తొలి కేసుగా పేర్కొన్నారు. మరోవైపు కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్​ 20 వరకు పాఠశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది కొరియా ప్రభుత్వం.

US forces in South Korea report first coronavirus case
కొరియాలోని అమెరికా జవానుకు కరోనా
author img

By

Published : Feb 26, 2020, 10:06 AM IST

Updated : Mar 2, 2020, 2:53 PM IST

దక్షిణ కొరియాపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా ఆ దేశంలోని అమెరికా బలగాల్లో ఓ జవానుకు ఈ ప్రాణాంతక వైరస్​ సోకినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. కొరియాలోని అమెరికా సైన్యంలో.. నిర్ధరణ అయిన తొలి కేసుగా పేర్కొన్నారు.

దక్షిణ కొరియాలో కరోనా వ్యాప్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న డేగు నగరానికి 30 కిలోమీటర్ల దురంలోని కరోల్​ క్యాంప్​లో జవానును ఉంచినట్టు అధికారులు తెలిపారు. జవానుకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.

1,146 మందికి కరోనా

దక్షిణ కొరియాలో కరోనా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మరో 169 మందికి ఈ మహమ్మారి సోకినట్లు కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 134 కేసులు డేగు నగరంలోనే నమోదైనట్లు తెలిపింది. మరో 19 కేసులు డేగు సమీప ఉత్తర గ్యాంగసంగ్​ రాష్ట్రంలో నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,146కి చేరింది. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు.

పాఠశాలలు బంద్​..

కరోనా వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా ఇప్పటికే పాఠశాలలను మూసివేసిన కొరియా ప్రభుత్వం.. మరికొన్ని రోజులు తరగతులు రద్దు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్​ 20 వరకు ప్లేస్కూల్స్​, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం ఆదేశించిందని విద్యాశాఖ ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే విశ్వవిద్యాలయాల పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: నిర్బంధంలో పలు హోటళ్లు

Last Updated : Mar 2, 2020, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.