ETV Bharat / international

బలగాల ఉపసంహరణపై అమెరికా నిశిత పరిశీలన - అమెరికా

చైనా- భారత్​ బలగాల ఉపసంహరణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాలు చేపట్టిన సైనిక బలగాల ఉపసంహరణను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది.

US
'బలగాల ఉపసంహరణను నిశితంగా పరిశీలిస్తున్నాం'
author img

By

Published : Feb 23, 2021, 11:11 AM IST

Updated : Feb 23, 2021, 11:48 AM IST

సరిహద్దులో భారత్​-చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించే విధంగా ఇరు దేశాలు చేపట్టిన చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్​ ప్రైస్​ తెలిపారు.

"బలగాల ఉపసంహరణ ప్రక్రియను మేము నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు చేస్తున్న ప్రయత్నాలని స్వాగతిస్తున్నాం. రానున్న రోజుల్లోనూ.. శాంతి కోసం భారత్​-చైనా చేపట్టే చర్యలను పరిశీలిస్తాము."

-నెడ్​ ప్రైస్, అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి

గతేడాది మే నుంచి నెలకొన్న ఉద్రిక్తతలు ఈ నెలలో కొంత తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 10న బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు డ్రాగన్ ప్రకటించగా.. ఆ తర్వాతి రోజు పార్లమెంట్ వేదికగా రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దీని ప్రకారం భారత బలగాలు ఫింగర్ 3-4 మధ్య ఉన్న 'ధన్​సింగ్ థాపా పోస్టు' వద్దకు చేరుకుంటాయి. చైనా దళాలు ఫింగర్ 8 వెనక్కు వెళ్లిపోతాయి.

ఇదీ చూడండి: భారత్ 'మాస్టర్ స్ట్రోక్​' వల్లే తోకముడిచిన డ్రాగన్!

Last Updated : Feb 23, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.