అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ఒక ఉపగ్రహాన్ని పంపిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ).. మానవ సహిత అంతరిక్ష యాత్రకూ సమాయత్తమవుతోంది. ఈ దిశగా ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేసింది. వారిలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. ఆమె పేరు నౌరా ఆల్ మాత్రౌషి. ఈ మేరకు దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మాక్తౌమ్ శనివారం ట్విట్టర్లో వెల్లడించారు.
-
We announce the first Arab female astronaut, among two new astronauts, selected from over 4,000 candidates to be trained with NASA for future space exploration missions. Congratulations Noura Al Matrooshi and Mohammed Al Mulla. pic.twitter.com/bfyquyzqAJ
— HH Sheikh Mohammed (@HHShkMohd) April 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">We announce the first Arab female astronaut, among two new astronauts, selected from over 4,000 candidates to be trained with NASA for future space exploration missions. Congratulations Noura Al Matrooshi and Mohammed Al Mulla. pic.twitter.com/bfyquyzqAJ
— HH Sheikh Mohammed (@HHShkMohd) April 10, 2021We announce the first Arab female astronaut, among two new astronauts, selected from over 4,000 candidates to be trained with NASA for future space exploration missions. Congratulations Noura Al Matrooshi and Mohammed Al Mulla. pic.twitter.com/bfyquyzqAJ
— HH Sheikh Mohammed (@HHShkMohd) April 10, 2021
4 వేల మంది దరఖాస్తుదారులను వడపోసి వీరిద్దరిని ఎంపిక చేశారు. వీరు అమెరికాలోని జాన్సన్ స్పేస్ సెంటర్లో శిక్షణ పొందుతారు. 2019లో యూఏఈకి చెందిన హజా అల్ మన్సూరీ.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో 8 రోజులు గడిపారు. తద్వారా అరబ్ ప్రపంచ తొలి వ్యోమగామిగా గుర్తింపు పొందారు. 2024లో చంద్రుడిపైకి మానవరహిత వ్యోమనౌకను పంపాలని యూఏఈ భావిస్తోంది.
ఇదీ చదవండి: అంగారకుడిపై హెలికాప్టర్.. ఎగిరేందుకు సిద్ధం!