యెమెన్ రాజధాని సానాలోని ఓ వలసదారుల నిర్బంధ కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 170కి పైగా మంది గాయపడ్డారు. ఈ మేరకు ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐఓఎం) తెలిపింది. వారిలో 90 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. అయితే.. ప్రమాదానికి గల కారణమేంటో తెలియరాలేదని చెప్పింది.
ఈ నిర్బంధ కేంద్రాన్ని హౌతీ తిరుబాటుదారులు నిర్వహిస్తున్నారు. ప్రమాద కారణాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. నిర్బంధం కేంద్రంలోని ప్రధాన భవనం వద్ద ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ కేంద్రంలో 700 మందికిపైగా వలసదారులను నిర్బంధించారని చెప్పారు.
ఇదీ చూడండి:యెమెన్లో తీవ్ర ఘర్షణలు-100 మంది మృతి