ETV Bharat / international

కశ్మీర్​' అంశంలో ఏకాకి అవుతోన్న పాక్​! - america

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రపంచ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్​కు బాసటగా నిలిచేందుకు ఏ దేశమూ సుముఖత వ్యక్తం చేయట్లేదు. కశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్తామన్న పాక్.. ఏకాకిగా మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కశ్మీర్​' అంశంలో ఏకాకి అవుతోన్న పాక్​!
author img

By

Published : Aug 8, 2019, 6:52 AM IST

జమ్ముకశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్తామన్న పాకిస్థాన్​కు ఏ దేశమూ మద్దతుగా నిలిచే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ విషయంలో దాయాది దేశం ఏకాకి అయ్యేలా ఉంది. కశ్మీర్​లో ఆర్టికల్​ 370ని రద్దు చేసి.. ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలి తీర్మానాలను భారత్​ ఉల్లంఘించిందని పాకిస్థాన్​ ఆరోపించింది. ఈ విషయంపై స్పందించేందుకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్​ అధికార ప్రతినిధి దుజారిక్​ నిరాకరించారు. కశ్మీర్​ ప్రాంతంలో నెలకొన్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.

భారత్​తో బ్రిటన్​ సంభాషణ

కశ్మీర్​ పునర్విభజన అంశంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్​తో సంభాషించినట్లు చెప్పారు బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్. ఈ విషయంపై భారత్​ స్పష్టత ఇచ్చినట్లు తెలిపారు. తాము ఆందోళన చెందుతున్న విషయాలను భారత్​కు చెప్పినట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో శాంతియుతంగా ఉండాలని భారత్​కు సూచించినట్టు చెప్పారు రాబ్​.

భారత్​కు మాల్దీవుల మద్దతు

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 చేస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపింది మాల్దీవులు. ఇది భారత్​ అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ప్రతి సార్వభౌమ దేశానికి చట్టాలను సవరించుకునే హక్కు ఉందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.

అమెరికాకు భారత రాయబారి వివరణ

జమ్ముకశ్మీర్ పునర్విభజన అంశం భారత్​ అంతర్గత విషయమని అమెరికాకు తెలిపారు భారత రాయబారి హర్ష్​ వర్ధన్​ శ్రింగ్లా. ఇతర దేశాలతో సంబంధాలపై ఈ అంశం ప్రభావం ఉండబోదని వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖలను ప్రభావితం చేయట్లేదని చెప్పారు. సుపరిపాలన కోసమే భారత ప్రభుత్వం జమ్ముకశ్మీర్​ను విభజించినట్లు స్పష్టం చేశారు శ్రింగ్లా. ఈ నిర్ణయంతో కశ్మీర్​ ప్రజలు ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను పొందుతారన్నారు.

పునర్విభజన అంశం భారత్​కు కొత్త కాదని, ఇలా చేయడం ఇది 12వ సారి అని ఓ ప్రశ్నకు సమాధానంగా వివరణ ఇచ్చారు శ్రింగ్లా.

RESTRICTION SUMMARY: MUST CREDIT CALIFORNIA DEPARTMENT OF FISH AND WILDLIFE
SHOTLIST:
CALIFORNIA DEPARTMENT OF FISH AND WILDLIFE – MUST CREDIT CALIFORNIA DEPARTMENT OF FISH AND WILDLIFE
Lassen County, California –  18 June 2019
1. Various of video from trail camera of wolf pack with three new pups ++INCLUDES JUMP CUTS FROM SOURCE++
STORYLINE:
California wildlife officials say the state's only known wolf pack has grown.  
The wolves were captured on video by a trail camera in far northern California in June.
Wildlife officials say the gray wolf is native to California but was nearly wiped out in the 1920s.
In the recently released video, the wolf pups can be seen playing and howling.
The Lassen pack consists of two or three adults or yearlings and three pups.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.