ETV Bharat / international

ఆత్మాహుతితో వంతెన పేల్చి.. రష్యన్​ సేనలను నిలువరించి - russia declares war on ukraine

Ukrainian soldier: ఒకే ఒక్కడు.. రష్యన్ సేనలను నిలువరించడానికి స్వతహాగా ప్రాణత్యాగం చేశాడు. తనకే బాంబులు చుట్టుకుని ఓ వారధి పేల్చే ప్రయత్నం చేశాడు. ఆ ఉక్రెయిన్​ అమరుడి త్యాగానికి అందరూ కన్నీళ్లతో అంజలి ఘటిస్తున్నారు.

ukrainian
వీర సైనికుడు
author img

By

Published : Feb 26, 2022, 8:34 PM IST

Ukrainian Soldier: తాను పుట్టిన గడ్డపై పరాయి దేశం దాడి చేస్తుందంటే ఏ ఒక్కరూ తట్టుకోలేరు. ఇక వీర సైనికులు అయితే.. తమ ఎదురుగా ఉన్న శత్రువు బలమైనది అయినా సరే, ఎదురొడ్డి నిలుస్తారు. చివరకు ప్రాణత్యాగానికి వెనుకాడరు. ఉక్రెయిన్‌పై రష్యా పోరు వేళ.. అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సమయం లేకపోవడంతో.. శత్రువుల రాకను అడ్డుకునేందుకు ఓ సైనికుడు తనను తానే పేల్చుకున్నాడు..! ఇప్పుడు ఆ అమరుడి త్యాగానికి అందరూ కన్నీళ్లతో అంజలి ఘటిస్తున్నారు.

ukrainian
రష్యన్ దళాలు

మెరైన్ బెటాలియన్‌కు చెందిన ఇంజనీర్ వొలొదిమిరోవిచ్‌.. హినిచెస్క్‌ వారధి వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో రష్యా దళాలు క్రిమియా నుంచి ఉక్రెయిన్‌ ప్రధాన భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయి. అవి లోపలికి ప్రవేశిస్తే విధ్వంసం తప్పదని భావించిన అతడు.. అందుకు కీలకమైన వారధిని పేల్చివేయాలనుకున్నాడు. అందుకోసం వారధికి బాంబులు అమర్చాలనుకున్నాడు. కానీ ఈలోపే బలగాలు దూసుకువస్తున్నాయి. ఆ కొద్ది సమయంలో వాటిని ఎలా నిలువరించాలో అర్థం కాలేదు. క్షణకాలం పాటు ఆలోచించి.. ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ బాంబుల్ని తనకే అమర్చుకొని.. తనతో పాటు వారధి కూడా పేలేలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన నిర్ణయాన్ని అమలు చేశాడు. వారధితో పాటు తనూ తునాతునకలై పోయాడు. ఆ సైనికుడి సాహసం.. రష్యన్‌ సేనల దూకుడును గణనీయంగా తగ్గించగలిగిందని అతడి సహచరులు ప్రశంసించారు. కానీ కళ్లఎదుటే తమ సహచరుడిని కోల్పోవడం వారిని తీవ్రంగా బాధించింది.

ఆ ఉక్రెనియన్‌ ఒంటరి ప్రయత్నం విఫలమై..

Russia Ukraine Conflict: రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం సైనిక చర్యను ప్రారంభించారు. అప్పటినుంచి ఒక్కో ప్రాంతాన్ని దాటుకుంటూ బలగాలు కీవ్ వద్దకు దూసుకువచ్చాయి. కాగా, రష్యా సైనిక వాహనాలు కీవ్‌లోకి ప్రవేశించకుండా ఉక్రెయిన్ సైన్యం విశ్వప్రయత్నం చేసి, పుతిన్ సేనల ధాటికి నిలవలేకపోయింది. ఇదే సమయంలో ఉక్రెనియన్‌ ఒకరు సైనిక వాహనాల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అవి నగరంలోకి రాకుండా నిలువరించాలని చూశారు. అయితే ఆ ఒక్కడికి అది సాధ్యం కాలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చదవండి: ఉక్రెయిన్​- రష్యా ఉద్రిక్తతలతో 'వలస' సంక్షోభం.. ప్రాణాలు అరచేత పట్టుకొని..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.