ETV Bharat / international

రష్యాకు ఈయూ షాక్.. కార్పొరేట్ సంస్థలూ దూరం.. - ఉక్రెయిన్ యుద్ధం

Ukraine Crisis: సహజవాయువు కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఐరోపా సమాఖ్య భావిస్తోంది. ఇందుకోసం చర్యలు ముమ్మరం చేసింది. వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటోంది. మరోవైపు, రష్యాలో పలు కార్పొరేట్ కంపెనీలు తమ సేవలను నిలిపివేశాయి.

Ukraine Crisis
ఉక్రెయిన్ యుద్ధం
author img

By

Published : Mar 3, 2022, 11:18 PM IST

Ukraine Crisis: ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ఐరోపా సమాఖ్య ప్రయత్నిస్తోంది. రష్యా నుంచి సహజవాయువు సరఫరాకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది.

ప్రస్తుతం రష్యా నుంచి ఐరోపా వరకు ఉన్న పైప్​లైన్ల ద్వారా చాలా వరకు ఈయూ దేశాలకు సహజవాయువు సరఫరా అవుతోంది. ఈయూ అవసరాల్లో 40 శాతం రష్యానే తీరుస్తోంది. యుద్ధం మరింత తీవ్రమైతే.. ఈ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో రష్యాపై ఆధారపడే అవసరం లేకుండా సహజవాయువు దిగుమతుల కోసం ఈయూ ప్రయత్నాలు ప్రారంభించింది. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఆధారిత ఇంధనానికి దూరంగా ఉంటోంది. అయితే, సహజవాయువు కోసం ఈయూ దేశాలు చేపట్టే చర్యలు ఫలితం ఇవ్వాలంటే నెలలు పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో సహజ వాయువు ధరలు గురువారం మరో రికార్డు స్థాయి ధరను నమోదు చేశాయి. 2021 ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే 10 రెట్లు పెరిగాయి. ఫలితంగా ఐరోపా ఇంధన అవసరాలు తీరాలంటే.. అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రష్యాపై ఐరోపా సమాఖ్యతో పాటు అమెరికా సైతం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అయితే సహజవాయువు విషయంలో అమెరికా ఎవరిపై ఆధారపడలేదు. సొంతంగానే ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకుంటోంది. ఈ విషయంలో ఐరోపా సమాఖ్యకే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి, సత్వరమే రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఈయూ నిర్ణయించుకుంది. సభ్య దేశాలన్నీ ఇందుకు అనుగుణంగా వ్యూహాత్మక నిల్వలను పెంచుకుంటున్నాయి. ద్రవరూప సహజ వాయువును దిగుమతి చేసుకునేందుకు జర్మనీ అదనంగా 1.66 బిలియన్ డాలర్లను వెచ్చించనుంది.

కార్పొరేట్ సంస్థలు దూరం..

Ukraine War: మరోవైపు, రష్యా, బెలారస్‌లలో తమ సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఐకియా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆయా దేశాల్లోని ఐకియా స్టోర్లలో పనిచేసే 15వేల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అటు ప్రముఖ వాహన తయారీ సంస్థలైన హోండా, మజ్‌దా సంస్థలు సైతం రష్యాకు తమ ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా.. తాజాగా ఈ జాబితాలోకి స్కోడా వచ్చి చేరింది. రష్యాలో తమ కార్యక్రమాలు అన్నింటిని నిలిపివేస్తున్నట్లు స్కోడా స్పష్టం చేసింది.

అటు సిమెన్స్‌ సైతం రష్యాతో తన వ్యాపార కార్యకలాపాలకు విరామం ఇచ్చింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో రష్యా కరెన్సీ రూబుల్‌తో పాటు అక్కడి వ్యాపార వాణిజ్య సంస్థలు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. వీటికితోడు ప్రముఖ సంస్థలు తమ సేవలను నిలిపి వేస్తుండటం రష్యా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వన్‌వెబ్‌ ఉపగ్రహాలను పంపం

Ukraine Russia Latest News: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వన్‌వెబ్‌ సంస్థకు సమస్యలను తెచ్చిపెట్టింది. లండన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు సంబంధించిన ఇంటర్నెట్‌ ప్రసార ఉపగ్రహాల ప్రయోగాన్ని రష్యా నిలిపివేసింది. శుక్రవారం 36 ఉపగ్రహాలను రష్యా నిర్మించిన సోయజ్‌ రాకెట్ ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన ఎరీన స్పేస్‌ ఎస్‌ అంతరిక్షంలోకి పంపాల్సి ఉంది. ఈ ప్రయోగం కజకిస్థాన్‌లో ఉన్న రష్యాకు చెందిన బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి జరగాల్సి ఉంది. వన్‌వెబ్‌ ఉపగ్రహ ప్రయోగాల కోసం రష్యాతో కొన్నేళ్లపాటు అమల్లో ఉండేలా ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఉపగ్రహాలను కేవలం రష్యా నిర్మిత సోయజ్‌ రాకెట్ల నుంచే ప్రయోగించాలి. వన్‌వెబ్‌ 648 రాకెట్లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకొంది.

తాజాగా ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యాపై బ్రిటన్‌ పలు ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ డైరెక్టర్‌ దిమిత్రి రోగోజిన్‌ స్పందిస్తూ.. యూకే ఆంక్షలకు ప్రతిగా వన్‌వెబ్‌ ఉపగ్రహాల ప్రయోగానికి నిరాకరిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రోస్‌ కాస్మోస్‌ ట్విటర్‌లో కొన్ని డిమాండ్లను ప్రకటించింది. వన్‌వెబ్‌ సంస్థలో ఉన్న వాటాలు మొత్తం యూకే ప్రభుత్వం విక్రయించేయాలని డిమాండ్‌ చేసింది. అంతేకాదు.. ఈ ఉపగ్రహాలను సైనిక అవసరాలకు వినియోగించమని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. యూకే వ్యవహరిస్తున్న తీరు కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు రోస్‌కాస్మోస్‌ పేర్కొంది. మాస్కో సమయం ప్రకారం గురువారం రాత్రి 9.30 సమయానికి ఈ డిమాండ్లు పూర్తికావాలని డెడ్‌లైన్‌ విధించింది. వన్‌వెబ్‌కు ఇప్పటికే 428 ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి. గత నెల కూడా కొన్ని ఉపగ్రహాలను పంపింది.

రష్యా మేజర్‌ జనరల్‌ మృతి?

ఉక్రెయిన్‌లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాకు భారీ స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు వస్తుండగా.. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ సైన్యం జరిపిన ప్రతిదాడుల్లో రష్యా మేజర్‌ జనరల్‌ ఆండ్రీ సుఖోవిట్స్‌స్కీ మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ మీడియా పేర్కొంది. రష్యా సెంట్రల్‌ మిలటరీ కేంద్రంలో డిప్యూటీ కమాండర్‌గా ఉన్న ఆండ్రీ.. సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన సన్నిహితుడు తెలిపినట్లు వెల్లడించింది.

ఉక్రెయిన్‌లో జరుపుతున్న సైనిక చర్యలో మేజర్‌ జనరల్‌ ఆండ్రీ సుఖోవిట్స్‌స్కీ ప్రాణాలు కోల్పోయారనే వార్త మమ్మల్ని ఎంతగానో కలచివేసిందంటూ ఆయన సన్నిహితుడు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయి. రష్యా సైన్యంలో ప్లటూన్‌ కమాండర్‌ నుంచి వైమానిక దాడుల విభాగానికి అధిపతిగా ఆండ్రీ ఎదిగారని చెబుతున్నాయి.

అణు స్థావరాలు జాగ్రత్త: చైనా

కాగా, యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్​లకు చైనా పలు సూచనలు చేసింది. అణు స్థావరాలను సురక్షితంగా చూసుకోవాలని పేర్కొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడతారని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ అధికారుల సమావేశంలో వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: చొచ్చుకుపోతున్న రష్యా బలగాలు- కీవ్​లో బాంబుల వర్షం

ఉక్రెయిన్​ నగరాలపై రష్యా విధ్వంసం.. 'అదే జరిగితే అణు యుద్ధమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.