ETV Bharat / international

నేపాల్​లో 150 హెక్టార్లను ఆక్రమించిన చైనా...! - నేపాల్​ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

భూబకాసురుడిలా తయారైన చైనా తాజాగా నేపాల్​కు చెందిన 150 హెక్టార్ల​ భూభాగాన్ని ఆక్రమించినట్లు ఓ బ్రిటన్​ పత్రిక కథనం ప్రచురించింది. అయితే చైనా ఈ వ్యాఖ్యలను ఖండించింది.

Nepal
నేపాల్​లో 150 హెక్టార్లను ఆక్రమించిన చైనా...!
author img

By

Published : Nov 4, 2020, 5:36 AM IST

నేపాల్​కు చెందిన 150 హెక్టార్లకుపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని బ్రిటన్​ పత్రిక 'ది టెలిగ్రాఫ్​' కథనం వెల్లడించింది. రెండు దేశాల సరిహద్దు సమీపంలోని అయిదు జిల్లాల్లో ఈ భూమిని డ్రాగన్​ కబళించిందని, సహజసిద్ధ సరిహద్దుగా ఉన్న ఒక నదిలో నీళ్ల ప్రవాహాన్నీ దీని కోసం మళ్లించిందని బయట పెట్టింది.

"సరిహద్దులో గస్తీ లేనిచోట్లకు పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ)ని పంపించి, మే నుంచి క్రమక్రమంగా భూమిని ఆక్రమించుకోవడం ప్రారంభించింది. హద్దులుగా ఉన్న రాతి స్తంభాలను పక్కకు జరిపేసింది. తర్వాత ఈ ప్రాంతాల్లో సైనిక స్థావరాలను నెలకొల్పింది. హిమాలయాల్లో ఎత్తైన ప్రదేశాల్లో పాగా వేసే వ్యూహంతోనే దీనికి పాల్పడింది." అని పేర్కొంది.

తాము నేపాల్​కు చెందిన ఎలాంటి భూమిని ఆక్రమించుకోలేదని చైనా స్పష్టం చేసింది. ఇవి పూర్తి వందుతులేనని కొట్టిపారేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.