Uber Eats Delivery in Space: 'ఫుడ్ డెలివరీ సర్వీసులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి'.. ఇక నుంచి ప్రపంచవ్యాప్తంగాకు బదులు విశ్వవ్యాప్తంగా అనాలేమో. ఎందుకంటే అంతరిక్షంలో కూడా ఈ ఫుడ్ డెలివరీ సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. వివిధ దేశాల్లో ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్న ఉబర్ ఈట్స్.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు రకరకాల ఆహార పదార్థాలను పంపించింది. దీంతో అంతరిక్షంలోకి ఫుడ్ డెలివరీ చేసిన తొలిసంస్థగా ఉబర్ ఈట్స్ రికార్డ్ సృష్టించింది. వీటిని ఓ దిగ్గజ వ్యాపారవేత్త తీసుకెళ్లడం విశేషం.
జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యుసాకు మేజావా అంతరిక్ష పర్యటనకు బుధవారం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఉబర్ ఈట్స్.. వ్యోమగాములకు అందించాల్సిన ఆహార పదార్థాలను మేజావాకు ఇచ్చి పంపించింది. తొమ్మిది గంటల పాటు ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్కు చేరుకున్న మేజాకు.. అక్కడి వ్యోమగాములకు ఉబర్ ఈట్స్ పార్సెల్‌ను అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో షేర్ చేసింది ఉబర్ ఈట్స్.
-
Uber Eats のデリバリーは、進化し続けています。
— Uber Eats Japan(ウーバーイーツ) (@UberEats_JP) December 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
今、配達していない場所へ、次々と。@yousuck2020 さん、配達ありがとうございます🚀#宇宙へデリバリー #UberEats pic.twitter.com/Sh0PsXXwMX
">Uber Eats のデリバリーは、進化し続けています。
— Uber Eats Japan(ウーバーイーツ) (@UberEats_JP) December 14, 2021
今、配達していない場所へ、次々と。@yousuck2020 さん、配達ありがとうございます🚀#宇宙へデリバリー #UberEats pic.twitter.com/Sh0PsXXwMXUber Eats のデリバリーは、進化し続けています。
— Uber Eats Japan(ウーバーイーツ) (@UberEats_JP) December 14, 2021
今、配達していない場所へ、次々と。@yousuck2020 さん、配達ありがとうございます🚀#宇宙へデリバリー #UberEats pic.twitter.com/Sh0PsXXwMX
ఇంతకీ ఏమున్నాయంటే..
వ్యోమగాముల కోసం తినడానికి రెడీగా ఉన్న పలు వంటకాలను పంపించింది ఉబర్ ఈట్స్. స్వీట్ సాస్‌తో వండిన బీఫ్, మిసో పేస్ట్‌లో ఉడికించిన మెక్కెరెల్ చేపలు, బ్యాంబూ షూట్స్‌తో వండిన చికెన్, బ్రేయిస్డ్ పోర్క్‌లు ఈ మెనూలో భాగం.
12 రోజుల పాటు అక్కడే..
ఉబర్ ఈట్స్ ఫుడ్‌ను వ్యోమగాములకు అందించిన బిలియనీర్ యుసాకు మేజావా కూడా 12 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలోనే గడపనున్నారు. బుధవారం కజఖస్థాన్లో బయలుదేరిన మేజావా.. 9 గంటల పాటు ప్రయాణించి ఐఎస్ఎస్ చేరుకున్నారు. ఇవి మర్చిపోలేని క్షణాలని పేర్కొన్నారు మేజావా.
ప్రస్తుతం బిలియనీర్లకే అందుబాటులో ఉన్న ఈ స్పెస్ ట్రావెల్ మరో 10 లేదా 20 ఏళ్లలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : వాట్సాప్ నుంచే జియో రీఛార్జ్.. నిత్యావసరాల కొనుగోలు కూడా!